Encounter | gangsters | Police

Police encountered the gangsters who open fire on police men at suryapet bustand

nalgonda, suryapet, encounter, police, up, telangana,

police encounter the accuses who open fired on police men at suryapet busstand. police men chase the accuses and find them at janakipuram, open firing on them. two men died and one police man died in this incident. ci and two constables injured.

నల్గొండలో ఎన్ కౌంటర్.. సూర్యాపేట నిందితులు హతం

Posted: 04/04/2015 09:37 AM IST
Police encountered the gangsters who open fire on police men at suryapet bustand

పోలీసుల మీదనే దుండగులు కాల్పులు జరిపిన ఘటన తెలంగాణ లో సంచలనం రేపింది. నల్గొండ ఘటనలో సూర్యాపేట బస్టాండ్ సమీపంలో మూడు రోజుల క్రితం పోలీసులపై కాల్పులు జరిపిన దోపిడీ దొంగలు హతమయ్యారు. సూర్యపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని జాజిరెడ్డి గూడెం మండలం సీతారాంపురం గ్రామం సమీపంలో ఇద్దరు దుండగులు ఒక వ్యక్తిని తుపాకితో బెదిరించి మోటార్‌ సైకిల్‌ తీసుకుని పారిపోయారు. మోటార్‌ సైకిల్‌ లాక్కునే ప్రయత్నంలో దుండగులు రెండు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. మోటార్‌ సైకిల్‌ లాక్కున్న గుర్తు తెలియని దుండగులు జనగాం వైపు పారిపోయారు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి సిఐ, అరవపల్లి పోలీసులు దుండగులను వెంబడించారు. మోత్కూరు మండలం  జానకీపురం శివారులో పోలీసులు ఎన్కౌంటర్ జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితులు అక్కడికక్కడే హతం కాగా రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు.

 కాగా అంతకు ముందు దుండగులు జరిపిన ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందగా, ఆత్మకూరు ఎస్ఐ సిద్ధిఖీ పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. గత మూడు రోజులుగా సూర్యాపేట కాల్పుల ఘటన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం దుండగులు పోలీసులకు తారసపడ్డారు. పోలీసులను నుంచి తప్పించుకున్న వారు ఓ వ్యక్తిని బెదిరించి బైక్పై పరారయ్యారు. దాంతో పోలీసులు సినీ ఫక్కీలో దుండగులను ఛేజ్ చేసి హతమార్చారు. మృతులు సూర్యాపేట కాల్పుల ఘటన నిందితులుగా నిర్థారించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nalgonda  suryapet  encounter  police  up  telangana  

Other Articles