police special monitoring team on social media

Police special monitoring team on social media

special monitoring team on social media, police special monitoring team, bengaluru police establish special monitoring team, police special monitoring team on social media, social media, facebook, twitter, special lab, Social Media Monitoring, police

bengaluru police establish special monitoring team on social media

తస్మాత్ జాగ్రత్తా..! సోషల్ మీడియాపై నిఘా..!

Posted: 03/30/2015 06:30 PM IST
Police special monitoring team on social media

టెలీ కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు.. అభివృద్దికి ఎంతో దోహదపడుతున్నాయో.. అదే స్థాయిలో వాటిని వినియోగించి నేరాలకు పాల్పడేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. నేరగాళ్లు సరికోత్త వ్యూహాలు, పద్దతుల ద్వారా నేరాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రస్తుతం నగరీకరణ ప్రాంతాలతో పాటు పల్లెభారతంలోనూ సామాజిక మీడియా, సెల్ ఫోన్లలో అసభ్య సందేశాలను పంపడం వంటి నేరాలు నమోదవుతున్నాయి. ఇలాంటి కేసుల దర్యాప్తు పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది.

సామాజిక మీడియాలో నమోదవుతున్న నేరాలను కట్టడి చేయడానికి పోలీసులు ప్రత్యేకృదష్టి పెట్టనున్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల నుంచి రాజధాని నగర పోలీసులో మెరికల్లాంటి 15 మంది అధికారులను ఎంపిక చేసి వారికి ఢిల్లీలో శిక్షణను ఇచ్చారు. గత పదిహేను రోజులగా పెలైట్ ప్రతిపాదికన నగర పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక ల్యాబ్‌లో సోషియల్ మీడియాల పనిపట్టడంలో నిమజ్ఞమై ఉన్నారు.  

సోషియల్ మీడియా ద్వారా ఎవరు, ఎప్పుడు, ఎక్కడ నుంచి సమాచారాన్ని రవాణా చేస్తున్నారన్న విషయంతో పాటు నిర్ధిష్ట విషయం అప్‌లోడ్ అయిన వెంటనే కనుగొనడానికి కొన్ని ప్రత్యేక విధానాలు, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు సమకూర్చుకుంటున్నారు. ఇందుకోసం ‘సోషియల్ మీడియా మానిటరింగ్ ల్యాబ్’ను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా హాకింగ్ నుంచి తప్పించుకోవడానికి వీలవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలను అనుసరించి ఫిర్యాదు అందిన తరువాత కేసులు నమోదు చేసేందుకు బదులు మానిటరింగ్ ల్యాబ్ సహకారంతో సుమోటోగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేయడానికి అవకాశం కలుగుతుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : social media  facebook  twitter  special lab  Social Media Monitoring  police  

Other Articles