Datawind to launch pocketsurfer smartphones starting at rs 1999

DataWind to launch PocketSurfer smartphones , DataWind launched PocketSurfer smartphones, PocketSurfer smartphones, PocketSurfer smartphones starting at Rs. 1999, dnaTechLaunch, Pocketsurfer, DataWind, smartphones, India, Canada, Reliance Communications, Akash tablet maker DataWind

Akash tablet maker DataWind has launched the most affordable smartphone starting at just Rs 1,999 in collaboration with Reliance Communications. The new range of PocketSurfer smartphones is powered with free unlimited internet browsing for one year on Reliance.

భారతీయ విపణిలో డాటావిండ్ స్మార్ట్ ఫోన్లు..

Posted: 03/18/2015 10:46 PM IST
Datawind to launch pocketsurfer smartphones starting at rs 1999

ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న డాటావిండ్ సంస్థ విపణిలో సరికొత్త స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీటిని సంస్థ సీఇఓ సునీత్‌సింగ్ తులి విడుదల చేశారు. ఈ శ్రేణిలో భాగంగా 2జి 4స్మార్ట్‌ఫోన్‌ను 1,999 రూపాయలకు, 3జి 4స్మార్ట్‌ఫోన్ 2,999 రూపాయలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తులి వెల్లడించారు. 2జి 4 ఫోన్ 3.5 అంగుళాల స్ర్కీన్ , డ్యూయల్‌సిమ్, ఎడ్జ్ నెట్‌వర్క్ కంపాటబుల్ సదుపాయాలు కలిగి ఉంటుందని, 3జి 4 స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల స్ర్కీన్ , డ్యూయల్ సిమ్, డ్యూయల్ కెమెరా కలిగి ఉంటుందని ఆయన చెప్పారు.

5 అంగుళాల స్ర్కీన్ కలిగిన 3జి 5స్మార్ట్ ఫోన్‌కు సంవత్సర కాలం వరకు ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్టు సింగ్ తెలిపారు. ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించడానికి తాము రిలయన్స్ కమ్యూనికేషన్‌తో అవగాహన కుదుర్చుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే డాటా విండ్‌ను దేశంలో అందుబాటులోకి తీసుకువచ్చామని, మరో 90 రోజుల్లో తమ వ్యాపారాన్ని భారత్‌లో నెలకొల్పనున్నట్లు వివరించారు. దీని ద్వారా కొత్తగా వెయ్యి ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ సీఇఓ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DataWind  PocketSurfer smartphones  

Other Articles