Snooping on rahul gandhi rocks parliament

rahul gandhi, gulam nabi azad,loksabha,parliament session,newdelhi

Opposition parties in Parliament on Monday vociferously protested the "snooping" on Rahul Gandhi, with the government dismissing their contention saying they were making a "mountain out of what is not even a molehill", leading the Congress to walk out of Rajya Sabha.

రాహుల్ గాంధీ ఇంట్లో సోదాలపై మండిపడ్డ కాంగ్రెస్

Posted: 03/16/2015 05:00 PM IST
Snooping on rahul gandhi rocks parliament

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇంట్లో పోలీసులు సోదాలు జరపడపై పార్లమెంట్ వేడెక్కింది.రాహుల్ గాంధీ వ్యక్తిగత వివరాల సేకరణపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  జెడ్‌ప్లస్ భద్రత ఉన్న వ్యక్తి నివాసానికి సమాచారం లేకుండా ఢిల్లీ పోలీసులు ఎలా వెళ్తారని గులాంనబీ ఆజాద్ రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై ఢిల్లీ పోలీసులు తీరుపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ కావచ్చు..మరే ఇతర వ్యక్తులపైనైనా కావచ్చు, గూఢచర్యం ద్వారా రాజకీయపార్టీలను భయపెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. గత ఆగస్టు నుంచి దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. మతస్వాతంత్య్రం తగ్గిపోవడమేకాకుండా ఇప్పుడు రాజకీయ స్వాతంత్య్రం కూడా దిగజారుతోందని మండిపడ్డారు. ఈ పరిస్థితిపై హోంమంత్రి సభలో ప్రకటన చేయాలని కోరారు. ఎందుకంటే ఈ అంశం కేవలం ఏ ఒక్క వ్యక్తికో సంబంధించిన విషయం కాదని.. ఈ విధానం వ్యక్తిగత స్వేచ్ఛకు అవరోధమే కాకుండా ప్రజాస్వామ్యానికే ఓ గొడ్డలిపెట్టు లాంటిదని తెలిపారు.

రాహుల్ వివరాల సేకరణ గూఢచర్యం కాదన్నారు. ప్రముఖుల వివరాల సేకరణ భద్రతకు సంబంధించిన పారదర్శక ప్రక్రియలో భాగమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ సంప్రదాయం 1987లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని తెలిపారు. వివరాల సేకరణ పత్రాన్ని 1999లో మార్చారని..అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్డీఏ ప్రభుత్వమా, యూపీఏ ప్రభుత్వమా అని చూడకుండాఢిల్లీ పోలీసులు ప్రతీ ప్రముఖుల ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తున్నారని ఉద్ఘాటించారు. ఇప్పటివరకు వివరాలను సేకరించే వారి జాబితాలో 526 మంది ఉన్నారన్న విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల శాఖలోని ప్రత్యేక విభాగం వివరాల సేకరణను పారదర్శకంగా చేస్తుందని దీనికీ, గూఢచర్యంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  gulam nabi azad  loksabha  parliament session  newdelhi  

Other Articles