Prime minister narendra modi tour to srilanka

modi, srilanka, india, jaffna, indian ocean, tamilians, china, fisherman,

Prime Minister Narendra Modi sets off on a five-day tour of Seychelles, Mauritius and Sri Lanka that is expected to give traction to the country's Indian Ocean outreach during which he also visit a former war zone and Tamil heartland of Jaffna on Tuesday.

కీలకంగా మారిన మోదీ శ్రీలంక పర్యటన

Posted: 03/10/2015 08:44 AM IST
Prime minister narendra modi tour to srilanka

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఐదు రోజుల పాటు సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారు. శ్రీలంకలో మోదీ పర్యటన ఈ నెల 13, 14 తేదీల్లో సాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశంలో యుద్ధం తో అట్టుడికిన జాఫ్నాను కూడా సందర్శిస్తారు. జాఫ్నాలో తమిళ ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నందున అక్కడి పరిస్థితిని మోదీ తెలుసుకోనున్నారు. శ్రీలంకలో భారత ప్రధాన మంత్రి ద్వైపాక్షిక పర్యటన జరపడం 28 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే భారత ప్రధాన మంత్రి జాఫ్నాను సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. భారత్ సహాయంతో జాఫ్నాలో నిర్మించిన దాదాపు 20 వేల ఇళ్లను మోదీ ఈ పర్యటనలో శ్రీలంకకు అప్పగిస్తారు. శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తాజాగా మరోసారి తెరమీదికి వచ్చిన తమిళ జాలర్ల హక్కుల సమస్యను మోదీ పర్యటన సందర్భంగా పరిష్కరించుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది.

భారత్- శ్రీలంక మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో పాటు ద్వైపాక్షిక పెట్టుబడుల పెంపు తదితర అంశాలపై కూడా మోదీ ఈ పర్యటనలో దృష్టి కేంద్రీకరిస్తారనిసమాచారం.  శ్రీలంక జలాల్లోకి ప్రవేశించే భారత జాలర్లను కాల్చి చంపుతామంటూ ఆ దేశ ప్రధాని విక్రమసింఘే చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి కొలంబోలో జరిగిన సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయాన్ని శ్రీలంక ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.  ఇది జాలర్ల జీవనోపాధికి సంబంధించిన సమస్య అని, దీనిని మానవతా దృక్పథంతో పరిశీలించాల్సిన అవసరం ఉందని శ్రీలంక గుర్తించిందని, కనుక శ్రీలంకతో చర్చలు జరపడం ద్వారా ఈ సమస్యను పరిష్కారం దిశగా భారత్ అడుగులు వేస్తోంది.  అంతర్యుద్ధం సందర్భంగా భారత్‌కు వలస వచ్చిన దాదాపు లక్ష మంది తమిళ శరణార్థులను మళ్లీ శ్రీలంకకు పంపేందుకు ఆ దేశంలోని కొత్త ప్రభుత్వంతో కలసి భారత్ కృషి చేస్తోంది. మరో వైపు సరిహద్దు దేశాలతో సఖ్యంగా లేకపోతే దేశ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత్ శ్రీలంకతో స్నేహానికి ముందుకు వచ్చింది. చైనా దూకుడుకు కళ్లెం వెయ్యడానికి భారత్ శ్రీలంకల మధ్య కొత్త ఒప్పందాలు పొడిచాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  srilanka  india  jaffna  indian ocean  tamilians  china  fisherman  

Other Articles