Anna hazare footmarch on march 25

annahazare, footmarch, padayathra, landbill, ramleelaground, delhi, vardha,

Anti-Corruption crusader Anna Hazare today held discussions with his associates over his planned pad-yatra (foot-march) from Sevagram here to Delhi to oppose the land bill.

మార్చి 25 నుంచి అన్నాహజారే పాదయాత్ర

Posted: 03/10/2015 08:25 AM IST
Anna hazare footmarch on march 25

భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే పాదయాత్రను ప్రారంభించనున్నారు. మహాత్మగాంధీ ప్రారంభించిన దండి యాత్రను స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్రకు హజారే సిద్ధమయ్యారు. రైతు ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా తీసుకువస్తున్న, భూసేకరణ చట్టాన్ని అన్నా హజారే ముందు నుండి వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం భూసేకరణ బిల్లులో మార్పులు తీసుకురావాలని పట్టుబడుతున్నారు. అందులో భాగంగా అన్నా పాదయాత్రకు సిద్దమయ్యారు.

పాదయాత్రపై కార్యాచరణ రూపొందించేందుకు అన్నా హజారే పూనె నుంచి వార్ధాకు చేరుకున్నారు.  పాదయాత్ర మార్చి 25న సేవాగ్రాంలో ప్రారంభమై ఏప్రిల్ 27న రామ్‌లీలా మైదానంలో ముగుస్తుందని ఆయన ప్రకటించారు. 1100 కిలోమీటర్ల మేర అన్నా హజారే పాదయాత్ర కొనసాగనుంది. ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగే ముగింపు కార్యక్రమంలో రాజకీయనేతలెవ్వరికీ వేదికపై స్థానం కల్పించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాదయాత్ర సందర్భంగా హింసాత్మక సంఘటనలు పాల్పడవద్దని, అలాంటి ఘటనలు చోటుచేసుకుంటే యాత్రను ఆపివేస్తానని హజారే హెచ్చరించారు. పాదయాత్రకు ముందు అన్నా హజారే స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ సొంత గ్రామాన్ని సందర్శిస్తారు. మార్చి 23న భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు హజారే నివాళులర్పిస్తారు. హజారే పాదయాత్రకు పలు రైతు సంఘా ల నుంచి మద్దతు లభిస్తున్నది. అయితే అన్నా హజారే పాదయాత్ర ప్రభుత్వంపై ఎంత వత్తిడి తీసుకువస్తుంది, భూసేకరణ బిల్లులో మార్పులపై చర్చించడానికి కేంద్రం అవకాశం కల్పించిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : annahazare  footmarch  padayathra  landbill  ramleelaground  delhi  vardha  

Other Articles