Haunted court hall in mysuru closed for 9 months

Haunted' court hall in Mysuru, Haunted' Mysuru court hall closed for 9 months, Haunted' court hall in Mysuru closed for 9 months, court hall in Mysuru|, Ghost' forces closure of court hall in Mysuru, ghost fear in mysuru court hall, lawyers divided over ghost in court hall, lawyers demanded to closure of court hall, ghost, court, court hall, mysure court closed

A court hall in Mysuru has remained locked for more than nine months in the fear that the room is haunted, triggering a firestorm of protests from lawyers.

స్టోర్ రూమ్ గా మారిన కోర్టు హాలు..

Posted: 02/20/2015 03:17 PM IST
Haunted court hall in mysuru closed for 9 months

కర్ణాటకలోని మైసూర్ కోర్టు హాలు.. గత తొమ్మిది నెలలుగా మూసివుంది. స్వయంగా న్యాయదేవత కొలువైన పవిత్రస్థలంలో ఓ కోర్టు హాలు మూసివేయడం ఏంటని సందేహం కలుగుతుందా..? అవునండి ఈ కోర్టు హాలులో దెయ్యం సంచరిస్తుందనే పుకార్ల హల్చల్ చేయడంతో కోర్టు హాలు మూసివేశారు. గత ఏడాది మే నెలలో మూతబడిన సదరు కోర్టు హాలును ఇప్పటికీ తెరవొద్దంటూ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు లాయర్లు మాత్రం వారితో విభేదిస్తున్నారు.  న్యాయవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇదే విషయంలో పరస్పరం వాదనలకు దిగుతున్నారు. దీంతో ఆ కోర్టు హాలును తెరిచే సాహసం ఎవరూ చేయడం లేదు.

ఎన్నో సంచలనాత్మకమైన తీర్పులను వెలవరించిన కోర్టు హాలు ప్రస్తుతం స్టోర్ రూమ్ గా మారిపోయింది. ఎందకంటే గతంలో ఇదే కోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయి దెయ్యమై అందులో సంచరిస్తున్నాడనే పుకార్లతో ఆ హాలును గత ఏడాది మే నెలలో మూసివేశారు. ప్రస్తుతం ఇందులో విరిగిపోయిన బల్లలు, కుర్చీలు వేసి స్టోర్ రూమ్గా వాడుతున్నారు. ఎన్నో ముఖ్యమైన కేసుల వాదనలకు ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులకు నెలవుగా నిలిచిన ఆ కోర్టు హాలు... మూఢనమ్మకాల కారణంగా మూతపడింది. అన్నింటికీ ఆధారలే ముఖ్యమనే మన న్యాయవ్యవస్థ కోవిదులు కూడా దెయ్యం అంటే భయం అంటూ మూసివేయించడం గమనార్హం.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ghost  court  court hall  mysure court closed  

Other Articles