Surya lodges complaint on his fan

Surya Files Complaint On His Fan, surya files police complaint, surya fan in police case, surya facebook, surya official face book, surya fan data base, social network gaint face book, surya fan base, surya, surya latest news, surya movies, surya photos, surya forth comming movies, surya movie collections, surya latest updates, surya movie news, surya cinema News, surya upcomming movies, surya new look,

An impersonator of actor Surya has not just shocked the actor, but the whole of his fanbase before he fooled the authorities of social networking giant Facebook too

అభిమానిపై సూర్య ఆగ్రహం.. పోలీసు కేసు నమోదు..

Posted: 01/22/2015 11:21 AM IST
Surya lodges complaint on his fan

యాంగ్రీ యంగ్ మాన్ గా, సిన్సియర్ పోలీసు అధికారి కాలీవుడ్ తో పాటు తెలుగు, కన్నడ, ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపుతున్న తమిళ నటుడు సూర్యకు అభిమానుల తాకిడి కూడా ఎక్కువే. వరుసగా వస్తున్న సినిమాలతో బిజీ షెడ్యూల్ లో చిక్కుకున్న సూర్యను అయన అబిమాని ఖంగుతినిపించారు. సూర్యనే కాదు అన అభిమాన లోకాన్ని సైతం సూర్య అభిమాని షాక్ గురి చేశారు. అంతేకాదండీ సోషల్ నెట్ వర్క్ దిగ్గజం ఫేస్ బుక్ ను కూడా సూర్య అభిమాని నమ్మించగలిగాడు. ఇంతకీ ఎవరా అభిమాని..?, ఏమా కథ.? నటుడు సూర్య అతడిపై పోలీసు కేసు పెట్టేందుకు ఎందుకు పూనుకున్నాడు..? ఇంతకీ అభిమాని చేసిన తప్పేంటి..? ప్రశ్నలు మీ మదిని తొలుస్తున్నాయా.. అయితే ఇదిగో వివరాలు..

సూర్య ఇప్పటివరకు తన అభిమానుల కోసం అధికారిక పేస్ బుక్ అకౌంట్ ను తీసుకోలేదు. తాను నిత్యం బిజీ షెడ్యూల్ మద్య వుండటం ఒక కారణం కాగా, తన సొంత విషయాలను అభిమానులకు చెప్పడం కూడా సహేతుకం కాదని సూర్య అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ తరుణంలో తన పేరిట అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ వుందని సమాచారం అందుకున్న సూర్య.. ఖంగుతిన్నాడు. తాను అధికారికంగా ఏ పేస్ బుక్ అకౌంట్ ను నిర్వహించడం లేదని, ఇలా ఎలా జరిగిందని తెలుసుకోవాలనుకున్నాడు. తాను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఫేస్ బుక్ కూడా అకౌంట్ పక్కన నీలి రంగులో రిక్ మార్కును పెట్టడం గమనించిన సూర్య.. ఒక అభిమాని తన పేరున అకౌంట్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నాడు.

తన ఫేస్ బుక్ అకౌంట్ ను ఓ అభిమాని నిర్వహిస్తున్నాడని తెలుసుకుని, అతడిపై తమిళనాడు చెన్నై పోలీసులకు పిర్యాదు చేశాడు. తక్షణం తన అకౌంట్ నిర్వహిస్తున్న అభిమానిపై  చర్యలు తీసుకోవాలని, తన పేజ్ నిర్వహణను నిర్వీరం చేసేలా చూడాలని చెన్నై సైబర్ క్రమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. అయితే అభిమాని నిర్వహిస్తున్న ఈ అకౌంట్ను ఫేస్ బుక్ యాజమాన్యం అధికారకమంటూ నీలి రంగు రిక్ మార్కును ఎలా పెట్టిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  facebook account  fan  police case  

Other Articles