Lingaa movie distributors start fasting

lingaa movie producer rockline venkatesh cries before media and says dont make a issue between two states lingaa movie news, lingaa movie producer cries, lingaa movie distributors fasting, lingaa movie producer rockline venkatesh, venkatesh appeals not to make two states issues, lingaa movie losses, lingaa movies songs, lingaa movie photos, lingaa movie latest updates

lingaa movie producer rockline venkatesh cries before media and says dont make a issue between two states

ITEMVIDEOS: రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్న ‘లింగా’

Posted: 01/10/2015 11:29 PM IST
Lingaa movie distributors start fasting

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కష్టాలు తప్పటం లేదు. కొచ్చడయాన్ నష్టాల నుంచి ఇంకా కోలుకోకముందే లింగా కష్టాలు పంపిణీదారులచే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే అగ్గిమీద గుగ్గులంలా వున్న ఆ రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ అగ్గి రాజేస్తుంది. లింగా సినిమాను విడుదల చేసిన పంపిణీదారులు తాము నిండా మునిగిపోయామంటూ చెన్నైలో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఏడుగురు పంపిణీదారులు 700 మంది థియేటర్ల యాజమానులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కొక్క పంపిణీదారుడు దాదాపు 7- 10 కోట్ల రూపాయల మేరకు నష్టపోయామని వాపోతున్నారు.

నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తమిళుడు కాకపోవటం, ప్రదాన పంపిణీదారుడు వేందర్ సినిమా నష్టాలతో తనకు సంబంధం లేదనటం... పంపిణీదారులు, థియేటర్ యాజమానులను రోడ్డున పడేసేలా చేసింది. లింగా చిత్రం ఇప్పటి వరకు కనీసం 25శాతం కూడా వసూలు చేయలేదని, తాము 75శాతం నష్టపోయామని వారు కన్నీళ్లపర్యంతం అవుతున్నారు. ఈ విషయమై చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్ నుంచి హామీ రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

అయితే లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్  మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. లింగా సినిమాపై రెండు రాష్ట్రాల మధ్య రాజకీయాలు చేయవద్దు అన్ని అన్నారు. రజనీకాంత్ నాకు మంచి మిత్రుడు ,అందుకే కన్నడ వ్యక్తినైన నాతో సినిమా చేశారు అని లింగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అన్నారు. కేవలం తాను కన్నడ వాడిననూ చిత్రం డిస్ట్రీబ్యూటర్లు కొత్త వివాదానికి తెరలేపుతున్నారని అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lingaa  rajinikanth  distributors fasting  

Other Articles