Krishnam raju purse stolen

Krishnam Raju purse stolen, Krishnam Raju purse theft, Krishnam Raju latest updates, Krishnam Raju movies, prabhas latest updates, shamshabad air port, rgia police, Amith shah hyderabad tour, amitshah latest, prabhas in baahubali, prabhaas in baahubali wallpapers, tollywood updates

Krishnam Raju purse stolen : Veteran actor krishnam raju purse stolen in shamshabad airport. bjp leader krishnam raju purse stolen when he went to airport for inviting amith shah

ఇక్కడ కూడా దొంగలుంటారా..?

Posted: 01/08/2015 08:33 AM IST
Krishnam raju purse stolen

రోడ్లపైన, వీధుల్లో దొంగతనాలు జరిగాయంటే పోలీసుల నిఘా తక్కువగా ఉంటుంది అనుకోవచ్చు కాని కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్ పోర్టులో చోరీ జరిగిందంటే ఏమనుకోవాలి. హైదరాబాద్శివారులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు పర్సు చోరీ అయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాహైదరాబాద్ కు వచ్చిన సందర్బంగా స్వాగతం పలికేందుకు కృష్ణంరాజు వెళ్ళారు. ఈ సమయంలోనే పర్సు చోరీ అయింది.

పర్సులో విలువైన ఏటిఎం కార్డులతో పాటు కొంత నగదు ఉందని కృష్ణంరాజు తెలిపారు. సీసీ కెమెరాలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీతో కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్ పోర్టులో చోరి కావటం ఆశ్చర్యకరమైన విషయం. పర్సు పోయింది కాబట్టి ఏటిఎంలో కార్డులు పెట్టగానే ఎవరు కొట్టేశారో పట్టేయవచ్చు. కానీ బంగారం, ఇంకేమైనా విలువైన వస్తువులు చోరి అయి ఉంటే ఎలా అని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో కూడా దొంగలు ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Krishnam Raju  shamshabad airport  tollywood latest  

Other Articles