భారతీయు యువతకు ఉజ్వల భవిష్యత్తు వుందని చెబుతున్న ఆర్థిక శాస్త్రవేత్తలు మాటలు అక్షరాల నిజమయ్యాయి. మంచి నైపుణ్యం, తెలివితేటలు వున్న భారతీయ విద్యార్థులను బహుళ జాతి సంస్థలు ఎగిరేసుకపోతున్నాయి. ఇటీవల ఐఐటీ బాంబే, నాగ్‌పూర్, కాన్పూర్, ఢిల్లీ విద్యార్థులు తమ చివరి సంవత్సరం ముగియకుండానే తమ సత్తాను చాటి కోట్ల రూపాయల ప్యాకేజీతో కూడిన ఉద్యోగాలను అందుకున్నారు. మరికొందరు ఉన్నత చదువులు, ఇంకొందరు మానసిక ప్రశాంతత కోసమని కోట్ల రూపాయల వేతనాన్ని కూడా వదులుకున్నారు. వీరితో తెలుగుతేజాలు కూడా వున్నారు.
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని ఎస్‌వీటీఎం ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ కె.శ్రీనివాసరెడ్డి కుమారుడు కె.వినీల్ ప్రతాప్(21)కు ఫేస్బుక్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం లభించింది. వార్షిక వేతనం రూ.రెండు కోట్లు. ఐఐటీ ముంబైలో బి.టెక్ పూర్తిచేసిన వినీల్ ప్రతాప్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వినీల్ ఇప్పటికే గూగుల్, ఈ-బే సంస్థల్లో ఉద్యోగం సంపాదించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రాంగణ నియామకాల్లో తాజాగా ఫేస్‌బుక్‌కు ఎంపికైనట్లు పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more