Acting blind to beg on delhi streets earned him 5 seconds of fame in aamir s pk

cting blind earned him fame, manoj roy beggar in pk movie, manoj bowl filled with extra coins, manoj roy life-changing role, manoj roy, assamme, Manoj from Bedeti in north-central Assam, delhi Jantar Mantar, manoj in aamir's pk

Feigning blindness ensured Manoj Roy a few extra coins in his begging bowl. The act was good enough for a life-changing role in Rajkumar Hirani’s film PK that released friday

నిజ జీవిత అంధుడి నటనే.. అమీర్ ఖాన్ తో నటించేలా చేసింది..

Posted: 12/20/2014 09:22 PM IST
Acting blind to beg on delhi streets earned him 5 seconds of fame in aamir s pk

గుడ్డివాడిగా నటిస్తూ జంతర్ మంతర్ వద్ద పర్యాటకులను బొల్తా కోట్టించి తన యాచకవృత్తిని కోనసాగించిన అతనికి నిజంగా తన జీవితంలో ఇలాంటి వెలుగులు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. విధి వంచించి యాచక వృత్తిలోకి దిగి అడుక్కుంటున్న అతన్ని అమీర్ ఖాన్ పీకే చిత్రం అదృష్టాన్ని నింపుతుందని ఎన్నడూ అనుకోలేదు. సామాన్యులు కూడా బయటి నుంచి చూడటానికే పరమితమయ్యే ఐదు నక్షత్రాల హోటల్లోకి తాను అడుగుపెడతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ తన జీవితంలో అనుకోలేని అనేక ములుపులకు అతని నిజ జీవిత అంధుడి పాత్ర దోహదపడింది.

అతని పేరు మనోజ్ రాయ్.. అస్సోం రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతానికి చెందిన సోనిట్ పూర్ జిల్లాలోని బెడిటీ గ్రామానికి చెందిన వ్యక్తి. అతని తండ్రి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. మనోజ్ రాయ్ చిన్నతనంలోనే తన తల్లి కన్నుమూసింది. ఈ క్రమంలో తన తండ్రి కూడా మంచాన పడటంతో అభ్యసిస్తున్న విద్యను కూడా మద్యలోనే వదిలేసాడు. మంచాన పడ్డ తండ్రికి సేవ చేస్తూ.. కొంత కాలం అ గ్రామంలోనే వున్నాడు. తండ్రి మందులకు కూడా డబ్బులు కరువ్వడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఇరవై ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం దేశ రాజధాని ఢిల్లీ భాట పట్టాడు. అయితే చదవు సంధ్యా లేకపోవడం కారణంగా ఎక్కడా పని లభించకపోవడంతో ఇక చేసేది లేక గుడ్డివాడిగా జీవితానికి అంకురార్పణ పలికాడు. తన చిన్నప్పుడు గుడ్డివాడిగా నటించి తన స్నేహితులను మెప్పించిన ఆటే అతని నిజజీవితంలో కూడా తోడుగా నిలిచింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అంధుడిగా నటిస్తూ యాచించడం ద్వారా తన జేబును నింపుకునే వాడు మనోజ్ రాయ్.

తొలినాళ్లలో కొద్దిగా కష్టంగా వసూళ్లయిన డబ్బు అతని బోజనానికి, ఇత్యాధులకు ఖర్చయ్యేది. క్రమంగా అతను నైపుణ్యం సాధించడంతో రోజువారీగా బాగానే కూడబెట్టుకుని తన తండ్రికి డబ్బును పంపేవాడు. ఇలా ఏళ్లు గడుస్తున్నాయి. అనుకోకుండా ఒక రోజు ఇద్దరు వ్యక్తులు తన వద్దకు వచ్చి.. నీకు నటించడం తెలుసా అన్నారు. అది తెలుసు కాబట్టే తాను రోజుకు రెండు పూటల బోజనం చేయగలుగుతున్నానని అన్నాడు మనోజ్ రాయ్. అయితే ఫలానా నెంబురు ఫోన్ చేస్తే విషయాన్ని చెబుతామంటూ అతనికి 20 రూపాయలు వేసి ఫోన్ నెంబరు కూడా ఇచ్చి వెళ్లారు ఆ ఇద్దరు వ్యక్తులు.  

అయితే ఈ ఫోన్ నెంబరు పట్ల అశ్రద్దగా వ్యవహరించవద్దని ఆకాశవాణి తనకు హితవు పలికినట్లుగా అనిపించింది. దాన్ని పథిలంగా దాచుకుని వారు చెప్పిన రోజున ఠక్కున ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి మనోజ్ రాయ్ ను నెహ్రూ స్టేడియానికి మరుసటి రోజున రమ్మని చెప్పారు. అక్కడి వెళ్లి చూడగానే మనోజ్ రాయ్ ఆశ్చర్యపోయాడు. నిజంగానే అక్కడ సినిమా షూటింగ్ సంబంధించి ఏర్పాటు జరుగుతున్నాయి. మనోజ్ తో పాటు ఏడుగురు ఇతర యాచకులు కూడా అక్కడు వున్నారు. వారంతా చెవిటి వారు కావడం కూడా మనోజ్ కు  కలసి వచ్చింది. అయితే సినిమా గురించి, అందులో నటించే నటీనటుల గురించి కోద్దిగా అలోచించాడు. కానీ వాటి గురించి తెలుసుకునే ముందు తాను సినిమాలోకి ఎంపికయ్యే వరకు పంచబక్ష పరమాన్నాలతో వారు పెట్టే బోజనమే అతని మదిని ముందుగా దోచింది. వారం రోజుల పాటు ఉచితంగా లభించే బోజనానికి ప్రాధాన్యత ఇచ్చి అక్కడే వుండేందుకు నిర్ణయించుకున్నాడు.

ఆ తరువాత మనోజ్ రాయ్ చిత్రంలో ఎంపికయ్యాడు. దీంతో అతడికి ఐదు నక్షత్రాల హోటల్ లో సినిమా యూనిట్ వసతి కల్పించింది. అంతే అతని దశ తిరిగింది. ఢిల్లీలోని మురికివాడల్లో నీటి ఎద్దడి కారణంగా రోజువారి స్నానానికి దూరమైన మనోజ్ పోద్దస్తమానం హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ లో తనవితీరా స్నానం చేశాడు. అక్కడ తెలిసింది తాను నటించబోయే చిత్రం సాదాసీధా నటుడిది కాదని, అగ్ర నటుడు అమీర్ ఖాన్, అనుష్మ శర్మలు కథానాయకుడు, నాయికగా నటిస్తున్న చిత్రమని అంతే మిగతా సమయంలో హోటల్ లో జబ్బలు చరచుకుంటూ వుండిపోయాడు.

ఇప్పడు అర్థమయ్యిందా మనోడు మనోజ్ రాయ్.. అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలో చాన్స్ కోట్టేశాడు..! అది కూడా అంధుడిగా. చిత్రం ప్రారంభంలోనే వీరిద్దరి షాట్ వస్తుంది. అమీర్ ఖాన్ రోడ్డుపై పరిగెడుతుండగా, రోడ్డుపై నిల్చుని యాచిస్తున్న మనోజ్ బొచ్చ లోంచి అమీర్ ఖాన్ చిల్లర డబ్బలు దొంగళించుకుని వెళ్తాడు. ఈ చిత్రం నిడివిలో ఐదు సెక్కన్లు మాత్రమే వున్నా.. మనోజ్ జీవితాన్ని అద్బుతంగా మార్చింది. ఇప్పడు మనోజ్ తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాడు. అక్కడే తనకు ఒక కొట్టులో ఉద్యోగం కూడా లభించింది. భవిష్యత్ లో అస్సామీ, బెంగాళీ చిత్రాలలో పాత్రల కోసం కూడా ప్రయత్నిస్తానంటున్నాడు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి ఇప్పడు మనోజ్ రాయ్ కి ఒక పేస్ బుక్ అకౌంట్ కూడా వుంది అంతే కదు తన మసస్సు దోచుకున్న మగువ కూడా దొరికింది. తన గ్రామస్థులంతా అతన్ని పీకే హనీ సింగ్ అంటూ సరదాగా సంబోధించడం కూడా అతని ఆనందాన్ని ఇస్తుంది. అమీర్ ఖాన్, రాజకుమార్ హిరానీ చిత్రం ద్వారా ఒక అబాగ్యుడికి అన్నిలభించడం కూడా హర్షనీయమే కదా..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pk movie  acting blind  manoj roy  aamir khan  

Other Articles