Another video of rohtak sisters fighting off an eve teaser surfaces

Haryana, Rohtak, Haryana sisters, molestation, Aarti, Pooja, Haryana brave girls, Crime against women, Molestation, rape, panchayat, Caught on Camera, bravery award, Republic day

Another video of now-famous Rohtak sisters - Pooja and Aarti - has surfaced, which shows the duo beating a youth, who allegedly passed lewd comments on them.

ఆ అక్కాచెల్లళ్లే వీళ్లు.. ఇక్కడా బుద్ది చెబుతున్నారు..

Posted: 12/03/2014 02:00 AM IST
Another video of rohtak sisters fighting off an eve teaser surfaces

ముగ్గురు పోకిరీలు.. వెకిలి చేష్టలు.. సూటిపోటి మాటలు.. అయినా ఆ ఇద్దరు అక్కాచెలెళ్లు బెదరలేదు. పోకిరీల ఆటలను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కోన్నారు. బెల్టుతో వారి తాట తీశారు సాహస అక్కాచెల్లెళ్లు. బస్సులో. అంత రద్దీలో వున్నా. వెనుక నుంచి వారిని ఊరుకోండి లేదంటే మిమ్మల్ని బలత్కారం చేస్తారు. ఎవరకీ తెలియని ప్రదేశంలో పడేస్తారు. మీ శవాలను ముట్టుకోడానికి కూడా జనాలు భయపడేలా చేస్తారని కొందరు వారిస్తున్నా.. వాటిని లెక్కచేయకుండా ధైర్యంగా పోకిరీల అటకట్టించారు. అయితే వీరికి ఇంత ధైర్యం ఎక్కడిది..? అన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రోహతక్ సాహస అక్కాచెల్లళ్లు మరో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్  చేస్తోంది. గత నెలలో వారు పాఠశాల నుంచి వస్తున్న సమయంలో పార్కులో పోకిరీలు వారిని బనాయించారు. అంతే అక్కచెలెళ్లు చిర్రెత్తుకోచ్చింది. వారిలో తమను బనాయించిన వాడిని టార్గెట్ చేసుకుని కుమ్మేశారు. అయితే పక్కనున్న అతని మిత్రులు మాత్రం వారిని వారిని వారించడానికి జంకారు. అంతేగా మరి సినిమా హీరోలుగా గుంపుగుంపులుగా వుంటడం మన పోకిరీలకు అలవాటేగా. అయితే ఒక్కసారిగా వారు తిరగబడి తన్నడంతో.. షాక్ కు గురైన మిత్రులు ఎక్కడి వారు అక్కడే నిశ్చేష్టులుగా నిలబడ్డారు.

అయితే ఈ ఘటన నెల రోజుల క్రితం జరింగిందని, అయితే తాము దీనిని పెద్దగా చేయకూడదని నిమ్మకున్నామని పూజ మీడియాకు తెలిపింది. ఇప్పడు ఆ వీడియోను అప్ లోడ్ చేయడంతో.. సదరు నిందితుడిపై కూడా కేసు పెడతామని వారు తేల్చిచెప్పారు. అయితే ఒక ఘటన జరిగింది కాబట్టి.. రెండో ఘటన ఎక్కడ జరిగినా.. ఎదుర్కోనేందుకు సిద్దంగా వున్నారు ఆ అక్కా,చెలెళ్లు. అందుకే.. బస్సులో తమను లైంగిక వేధింపులకు గురిచేసిన వారిని ధైర్యంగా ఎదుర్కోన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles