Nadu iravu tamil movie shots in 12 hours only

nadu iravu tamil movie, nadu iravu tamil movie shooting time, nadu iravu shoot in 12 hours, movie shooting process, movie making process, latest movie news, koliwood latest news

nadu iravu tamil movie shooting completes in 12 hours only : tamil movie nadu iravu shooting completed only in 12 hours only from evening 6to morning 6 o clock. The makers of a horror flick have claimed that they had completed the shooting of the film in 12 hours

గ్రేట్ : 12గంటల్లో సినిమా షూటింగ్ పూర్తి

Posted: 11/06/2014 06:39 PM IST
Nadu iravu tamil movie shots in 12 hours only

సినిమా తీయాలంటే కనీసం రెండు నెలల సమయం అయినా పడుతుంది. కొన్ని సినిమాలకు రెండు సంవత్సరాలు కూడా పడుతుంది ఈ విషయం తాజాగా తెరకెక్కుతున్న సినిమాలను చూస్తే తెలుస్తుంది. షూటింగు మొదలు పెట్టాక ఒక్కో సీన్ కోసం టేకుల మీద టేకులు, సెట్లు, కొత్త ప్రదేశాలకు వెళ్ళి చాలా కష్టపడతారు. కాని తమిళంలో ఇదేమి లేకుండా కేవలం పన్నెండు గంటల్లో సినిమా షూటింగ్ పూర్తి చేశారు. కోలివుడ్ అంతా ఈ దెబ్బతో నోరెళ్లబెట్టింది. సూర్యుడు వెళ్లగానే షూటింగ్ మొదలు పెట్టి మళ్ళీ సూర్యుడు రాకముందే సినిమా లైట్లు ఆర్పేసి ప్యాకప్ చెప్పారు.

తమిళంలో వస్తున్న ‘నాడు ఇరవు’ అనే సినిమాను మరిస డైరెక్ట్ చేస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలకు తమ మూవీ షూటింగ్ ప్రారంభించి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు మొత్తం ఫూర్తి చేశామన్నారు. అరవై ఏళ్ళ తమిళ సినిమా చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఎవరూ సినిమా తీయలేదని డైరెక్టర్ చెప్పారు. హర్రర్ కధతో ఈ సినిమా వస్తోంది. ముగ్గురు జంటలు ఓ బంగ్లాలో ఎదుర్కున్న సంఘటనలతో సినిమా తీశామన్నారు. ఇక ‘నాడు ఇరవు’ అంటే తెలుగులో ‘అర్ధరాత్రి’ అని అర్ధం.

1999లో ‘సుయంవరం’ అనే సినిమాను 24గంటల్లో షూటింగ్ పూర్తి చేసి రికార్డు సృష్టించగా.. దీన్ని ‘నాడు ఇరవు’ బ్రేక్ చేసింది. తెలుగులో కూడా గతంలో ఈ తరహా ప్రయోగాలు జరిగాయి. అయితే ఈ మద్య చాలా టైమ్ తీసుకునే సినిమాలు వస్తున్నాయి. కాని పూరి జగన్నాధ్ మాత్రం వేగంగా కేవలం రెండు లేదా మూడు నెలల్లో సినిమా పూర్తి చేస్తాడు అని పేరుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nadu iravu  shooting  koliwood  latest news  

Other Articles