Power crisis in telangana a small problem will sit and sought it out says ap cm chandrababu

power crisis, Telangana, small problem, will sought it out, ap cm chandrababu, AP CM, Tour, Bangalore, chandrababu

power crisis in Telangana a small problem, will sit and sought it out says ap cm chandrababu

అది చాలా చిన్న సమస్య.. చర్చించుకుంటాం..

Posted: 11/04/2014 02:40 PM IST
Power crisis in telangana a small problem will sit and sought it out says ap cm chandrababu

తెలంగాణలో విద్యుత్ సమస్యలపై మంత్రి హరీష్ రావు బృందంలోని ఎంపీల బృందం కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను అశ్రయించిన నేపథ్యంలో మంచి ఫలితాలే వస్తున్నాయ్. ఓ వైపు కేంద్రమంత్రి ఉమాభారతి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని సూచించాగా, మరోవైపు రాష్ట్ర  పునర్ విభజన బిల్లు మేరకు తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను ఇవ్వలేదని చెప్పిన నేపథ్యంలో పియూష్ గోయల్.. ఇద్దరు ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలుస్తామని చెప్పడంతో ప్రస్తుతం పరిస్తితులు వాటంత అవే సద్దుమణుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా అలస్యంగా తెలంగాణలోని విద్యుత్ సమస్య ఉదృతి అర్థమయ్యిందట., అసలది సమస్యే కాదంటున్నారు. ఒక వేళ సమస్యగా పరిగణించాల్సి వస్తే.. అది చాలా చిన్న సమస్యగా చూడాలంటున్నారట. ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే ఒకరికొకరు సహకరించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో మంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఇవాన్నీ ఆంద్రప్రదేశ్ లో చెప్పిన మాటాలు కాదట. మరో పోరుగు రాష్ట్రం కర్ణాటకలో ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు.

బెంగళూరులో న్యూటనిక్స్ ఐటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం మాట్లాడుతూ.... నవ్యాంధ్రలో పరిశ్రమలు, ఐటీ సంస్థల విస్తృతికి మంచి అవకాశాలున్నాయని అన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ చిత్రపటంలో నిలిపామని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే నవ్యాంధ్రలోని కూడా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలోని విజయవాడ అద్భుత నగరం, తిరుపతి ఆధ్యాత్మిక నగరమని చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో క్లౌడ్ కంప్యూటరింగ్ ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పుకు నాంది అని అన్నారు. ఇటీ సాయంతో సంక్షేమ పథకాల అమలులో అనర్హులను ఏరివేస్తామని చెప్పారు.  ఇంత చెప్పారు కానీ తెలంగాణకు విద్యుత్ ఇస్తారా..? లేదా..? అన్నది మాత్రం చంద్రబాబు స్పష్టం చేయలేదు.

ఒకవైపు విద్యత్ ఇబ్బందులతో తెలంగాణలోని రైతులు చేతికందిన పంట.. ఇంటికి రావడంలేదన్న భాధతో అత్మహ్యతలు చేసుకుంటుంటే.. దానిని చిన్న సమస్యగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిగణించడాన్ని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : power crisis  Telangana  small problem  will sought it out  ap cm chandrababu  AP CM  Tour  Bangalore  chandrababu  

Other Articles