దాదాపు ముప్పై ఏడున్నర లక్షల విలువైన ఓ వడ్డాణం...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తుండగానే మరో ప్రశ్న తెరపైకి వచ్చింది. ఓ మహిళా మంత్రికి గ్రానైట్ వ్యాపారులు బంగారు వడ్డాణం గిప్ట్గా ఇచ్చినట్టు వచ్చిన వార్త....సచివాలయంలో టాక్ ఆఫ్ టుడేగా మారిపోగా.. అదే సమయంలో అవిడకే వడ్డాణం ఇప్పిస్తే.. మరి సొంత అన్నయ్యకు ఎంత ఇప్పించావుంటూ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మహిళా మంత్రిని పిలిచి వివరణ అడిగినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు ఇటీవలే ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు ఆమెకు సుమారు రూ.37 లక్షల విలువైన బంగారు వడ్డాణం కానుకగా ఇచ్చినట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి సోదరుడు...దగ్గరుండి ఈ తతంగాన్ని నడిపించారట. ఈ ఆరోపణలను పీతల సుజాత తీవ్రంగా ఖండించారు. తాను ఎవరి దెగ్గరా బహుమతులు తీసుకోలేని స్పష్టం చేశారు. తనకు గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేసిన మాట వాస్తవమేనని అయితే వారు తనకు ఎలాంటి గిప్ట్లు ఇవ్వలేదన్నారు.ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు తనను పిలిచి వివరణ అడిగినట్లు వస్తున్న వార్తలు కూడా సత్యదూరమన్నారు. తనపై కావాలనే ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.
అయితే మంత్రి పీతల సుజాతపై ఆరోఫణలు వచ్చిన నేపథ్యంలో.. అంతకు మించిన స్థాయిలో ఇప్పుడు మరో మంత్రిపై కూడా ఆరోఫణలు వెల్లువెత్తుతున్నాయి. సహచర మంత్రికే 37 లక్షల రూపాయల విలువైన బహుమతి ఇప్పించిన నేపథ్యంలో..సోంత అన్నయ్యకు ఎంత ఇప్పించి ఉంటారన్న ఆరోఫణలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు..ఇద్దరు మంత్రులతో వ్యవహారం నడిపేందుకు ఆయన ఎంత తీసుకుని వుంటారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తామని చెప్పిన చంద్రబాబు.. అవినీతి మంత్రులను తన క్యాబినెట్ నుంచి తప్పించాలని కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more