Mega hero ramcharan open heart with rk promo

Ram charan Open heart with RK 250th Episode of Open heart with RK , mega power star, popular channel, landmark episode, stunning talk show, Radha Krishna

Mega Hero Ramcharan Open Heart with Rk - Promo, a stunning talk show by Radha Krishna

అర్కే 250వ ఓపెన్ హార్ట్ షోలో రామ్ చరణ్..

Posted: 10/25/2014 02:38 PM IST
Mega hero ramcharan open heart with rk promo

వెండి తెర మగధీర బుల్లి తెరపై కనబడనున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో చిన్న తెరపై కనిపించనున్నాడు. అంటే అదేదో సీరియల్ లో నటిస్తున్నడని కాదు. ఓ ప్రముఖ చానెల్ నిర్వహించనున్న టాక్ షోలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. ఆ షో ఏంటి, ఏ ఛానెల్ లో ప్రసారమవుతుందనేగా మీ ప్రశ్న, అక్కడికే వస్తున్నాం.. మోగా వంశానికి వారసుడు, సీనీమా చరిత్రలో మగధీరుడు, తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ సక్సెస్ తో దూసుకెళ్తున్న రామ్ చరణ్ తేజ.. తన మనస్సు విప్పి మాట్లాడనున్నాడు.

వీ రిపోర్ట్.. యూ డిసైట్ అనే టాగ్ తో 2009 అక్టోబర్ 15న లాంచ్ అయిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ తన వార్తలు, వార్తేతర కథనాలు, విశ్లేషణలతో తెలుగు ప్రజలలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకుంది. ఈ ఛానల్ చీఫ్ ఎడిటర్ రాధా కృష్ణ తన వాగ్దాటితో నిర్వహించే కార్యక్రమమే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. ఈ షో క్రమంగా ప్రారంభై అప్పడే 250 ఎపిసోడ్ ను పూర్తి చేసుకునే పనిలో వుంది. ఈ ఎపిసోడ్ కే మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది. సాధారణంగా ఏ రాజకీయ నేతలైనా.. సెలబ్రీలలైనా సెటైర్ల నుంచి వివాదాస్పద ఘటనల వరకు, విమర్శల నుంచి నియమనిబంధనల వరకు అర్కే దేనిని వదిలిపెట్టరంటారు. అందుకనే ఈ షో అంత పాపులారిటీ సంపాదించింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన జీవితంలోని పలు ఘటనలపై తన మనస్సులోని మాటలు చెబుతారన్నమాట.

స్వతహాగా యువకుడు, అందులోనూ మంచి పాపులారటీ వున్న సెటబ్రిటీ దీనికి తోడు అప్పడప్పుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలగలపి.. దూకుడు స్వభావిగా ముద్రపడిన రామ్ చరణ్.. ఈ షోలో అర్కేతో ఏ ఏ విషయాలను పంచుకున్నారని తెలుసుకోవాలని వుందా..? అప్పుడెప్పుడో కోత్తగా పెళ్లైన నవయువ జంట కారులో వెళ్తుంటే అడ్డురావడమే కాకా దుర్భాషలాడినందుకు ఇద్దరు సాఫ్ట్ వేర్ యువకులకు గుణపాఠం చెప్పిన ఘటన నుంచి, ఆ నేపథ్యంలో మీడియా చేసిన హంగామాపై నోరుపారేసుకన్న విషయాల వరకు, సినిమాల్లోకి రావడం నుంచి సీనిమాల్లో దర్శకరత్నతో గోడవ వరకు అన్ని విషయాలను, అంతేకాదండోయ్, పెళ్లి ముందు ఉపాసన పంచుకున్న విషయాలు, చిరంజీవి 150 చిత్రం ఇలా ఒక్కటేమిటి అన్ని విషయాలను రామ్ చరణ్ స్వయంగా రివీల్ చేయనున్నారు. సో వాచ్ ఓపెన్ హార్ట్ విత్ అర్కే...

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles