Narendra modi government misleading public on black money issue congress

Black money, Swiss banks, Swiss black money, indian government, PM Narendra Modi, misleading, public, congress, Nitish Kumar, JD (U), Arun jaitley, TMC, mamatha benerjee

narendra modi government misleading public on black money issue congress

మోడీ సర్కార్ ప్రజలను మాయచేస్తోంది..

Posted: 10/18/2014 08:12 PM IST
Narendra modi government misleading public on black money issue congress

నల్లధనంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రజలను మాయచేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. నల్లధనం వెనక్కు తీసుకొచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు ప్రజలకు భ్రమ కల్పిస్తోందని ఏఐసీసీ సమాచార శాఖ చైర్మన్ అజయ్ మాకెన్ మండిపడ్డారు. 1995 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జర్మనీతో కుదుర్చుకున్న ద్వంద్వ పన్నుల మినహాయింపు ఒప్పంద కారణంగానే నల్లధనం వివరాలు కష్టతరంగా మారాయన్న అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం నల్లధనం అంశంపై మూడు తీర్మానాలు ప్రవేశపెట్టిందని.. వాటితో ఎటువంటి లబ్దిచేకూరకపోగా కాంగ్రెస్ ను విమర్శించడం తగదన్నారు.
 
ఈ అంశంపై కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేసిన మోదీ సర్కారు.. చేతకాక యూపీఏ ప్రభుత్వాన్ని తప్పుబడుతుందన్నారు. తాజాగా ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలకు మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. అసలు ఆ ఒప్పందం జూన్ 19, 1995లో జరగలేదని..1996 వ సంవత్సరంలోని సెప్టెంబర్ మరియు నవంబర్ లో అని మాకెన్ తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదన్న సంగతిని గుర్తు చేశారు.  ఆ ఒప్పందానికి సంబంధించి అరుణ్ జైట్లీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

వెనకడుగు వేస్తున్న మోడీ : నితీష్ కుమార్

ఎన్నికల ముందు చెప్పిన మాటలను అమలు చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వెనుకడుగు వేస్తున్నారని బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శించారు. అప్పుడు నల్ల ధనాన్ని వెలికి తీస్తానని మోదీ చెప్పారన్నారు. ఇప్పుడు వివరాలు వెల్లడించేందుకు వెనుకడుగు వేస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ  నల్లధనం విషయంలో యూటర్న్ లేదని చెప్పారు. ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు తగదన్నారు.

బీజేపీ యూటర్న్ ను ప్రశ్నించిన తృణమూల్

విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువస్తామని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోదీ సర్కారు వెనక్కి తగ్గడంపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. నల్లధనం వ్యవహారానికి సంబంధించి అసలు బీజేపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం నిజంగా బాధాకరమని తృణమూల్ రాజ్యసభ అభ్యర్థి ఓబ్రెయన్ విమర్శించారు. దేశంలోని అవినీతి కారణంగానే కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీచాయని ఆయన తెలిపారు. ఇదే తరహాలో బీజేపీ కూడా వ్యవహరించడం రెండు పార్టీలు దొందూ దొందూగానే వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.' నల్లధనంపై చేపట్టే చర్యలు ఏమిటి? దీనిపై ఉపయోగంలేని కమిటీ ఏర్పాటు ఒక్కటే చాలదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి తృణమూల్ సిద్ధంగా ఉందని తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles