Hudhud cyclone adverse impact on vishaka becoming a smart city

hudhud victims, cm relief fund, cyclone, andrapradesh, vishakapatnam, smart city, prime minister modi, America, investments, software companies, Industries

hudhud cyclone adverse impact on Vishaka becoming a smart city

స్మార్ట్ సిటీ ఆశలపై సైక్లోన్ నీలినీడలు..

Posted: 10/16/2014 11:11 AM IST
Hudhud cyclone adverse impact on vishaka becoming a smart city

నవ్యాంధ్రప్రదేశ్‌లోని యవ్వన నగరమది. దేశంలోనే వంద స్మార్ట్ సిటీలలో ముందంజంగా ఎంపిక చేసిన ఐదు నగరాలలో అదోకటి. స్మార్ట్ సిటీతో తమ అత్యాధుని వసుతులు అందుతాయని సంబరాలు జరుపుకున్నారు విశాఖ వాసులు. అత్యాధుని పరిజ్ఞాన సేవలు తమ ముగింట వాలుతాయని కలులుగన్నారు. ప్రచండవేగంతో కడలిశరంలా వచ్చిపడిన హుద్ హుద్ తుపాను విశాఖ వాసుల ఆశలను అడియాశలు చేసింది. పారిశ్రామిక నగరం కుప్పకూలింది. విభిన్న రంగాల్లో ప్రగతి దిశలోని సముద్ర తీర నగరం హుద్ హుద్ దెబ్బకు తల్లడిల్లింది. ఆర్థికంగా కోలుకోవడానికి సమయం పట్టేలా ఉంది.

ఉత్తరాంధ్రలోని తక్కిన రెండు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం భవితను, అభివృద్దిని తనవై వేసుకుని ముందుకు సాగుతున్న విశాఖ నగరంపై సముద్రుడు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కనీవిని ఎరుగని రీతిలో నష్టాన్ని మిగిల్చాడు. దివి సీమ ఉప్పెన తరువాత అంతటి తీవ్రతతో విరుచుకు పడ్డాడు. విశాఖ స్థూల జిల్లా ఉత్పత్తి రూ.60 వేల కోట్లు. ఇందులో సుమారు రూ.35 వేల కోట్లు పరిశ్రమల రంగం నుంచే ఉంటుంది. తక్కిన రూ.25 వేల కోట్లు సేవా, వ్యవసాయ రంగాల నుంచి సమకూరుతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జీడీపీ రూ.50 వేల కోట్ల వరకు ఉండగా ఇందులో పరిశ్రమల వాటా రూ.30 వేల కోట్ల వరకు ఉండవచ్చనేది అంచనా. తక్కినది వ్యవసాయ, సేవా రంగాల నుంచి వస్తుంది.

తుపాను వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిన నష్టం సంగతి అటుంచితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలూ తీవ్రంగా దెబ్బతిన్నాయని సమీక్ష సందర్భంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం పరిస్థితికి దర్పణం పడుతోంది. విశాఖ పోర్టు, ఉక్కు కర్మాగారం, హెచ్‌పీసీఎల్, బీహెచ్ఈఎల్, కోరమాండల్ తదితర పరిశ్రమలు దెబ్బతిన్న వాటిలో ఉన్నాయి. దాదాపు ప్రతి భారీ పరిశ్రమకు రూ.వందల కోట్లలోనే నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాలే వెల్లడిస్తున్నాయి. ఆయా సంస్థలకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరణతో పాటు యంత్రాలను పూర్వస్థితికి తీసుకొచ్చి ఉత్పత్తిని ప్రారంభించేందుకు రోజులు, వారాలు, నెలలు పట్టే స్థితి ఉందని పారిశ్రామిక వర్గాలు, సంస్థలు వెల్లడిస్తున్నాయి.

అయితే విశాఖ నగరా తీరాన్ని కేంద్రంగా చేసుకుని 40 ఏళ్ల తరువాత తుపాను తీరం దాటింది. దీంతో మునుపెన్నడూ లేని విలయ విధ్వంస రచనను సముద్రుడు రచించాడు. దీంతో ఇక్కడ పారిశ్రామిక రంగం అభివృద్దిపై నీలినీడలు కమ్ముకున్నాయి. శరవేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖ నగరంలో పారిశ్రామికంతో పాటు ఐటీ సెక్టార్ కూడా పుంజుకుంది. విశాఖను స్మార్ట్ సిటీగా చేస్తామని అది కూడా అగ్రరాజ్యం అమెరికా సహకారంతో జరుగుతుందని ప్రదాని అక్కడి పర్యటనలోనే ప్రకటించారు. దీంతో విశాఖను కేంద్రంగా చేసుకుని తమ సంస్థలను స్థాపించాలని యోచిస్తున్న ఐటీ పరిశ్రమలు ఇప్పుడు సందిగ్ధంలోకి జారుకున్నాయి.  ఇక ముందు కూడా ఇలాంటి తుపాన్లు వచ్చి బీభత్సాన్ని సృష్టించవని నమ్మకమేంటని వారు హడలిపోతున్నారు. చిన్న సమస్యను భూతద్దంలో చూసే అమెరీకన్లు.. ఇంతటి ప్రళయకార విధ్వంసాన్ని చూసిన తరువాత అక్కడ పెట్టుబడులకు ముందుకు వస్తారా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

విశాఖ నగరంలోని సముద్ర తీరంలో పర్వతశేణ్నులు వుండటం వల్ల ఈ తీరంలో తుఫాన్లు రావని ఇప్పటి వరకు ప్రజలకు కూడా గట్టి నమ్మకంతో వున్నారు. ఒక వేళ తుపాన్లు వచ్చినా.. అవి దిశను మార్చుకుని ఇతర ప్రాంతాల్లో తీరాన్ని దాటుతాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. అయితే హుద్ హుద్ లాంటి తుపాన్లు రావడం, సరిగ్గా విశాఖ తీరాన్నే కేంద్రంగా చేసుకుని తీరం దాటడంపై ప్రజలు కూడా అందోళన చెందుతున్నారు. వాతావరణ నిఫుణలు చెప్పినట్లుగా విశాఖ తీరంలో తుపాన్లా రావు. ఒక వేళ వస్తే అంచనాలకు అందని నష్టం మాత్రం జరుగుతుంది. సముద్రంలోని పర్వత శ్రేణులను దాటుకుని తుఫాను తీరం దాటాలంటే అది సాధారణం కన్నా ఎక్కవ పరిమాణంలో ఉద్దృతంగా వచ్చే తుపాను అయ్యి వుండాలని వాతావరణ నిపుణులే అంటున్నారు. హుద్ హుద్ తుపాను సుమారు పది కీలోమీటర్ల ఎత్తు పరిణామంలో విశాఖ తీరాన్ని దాటిందని కూడా వారు వెల్లడించారు. దీంతో విశాఖ నగరంలో సైక్లోన్ ప్రభావం దాటికి స్మార్ సిటీ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles