Kejriwal gives bumper offer to bjp

Arvind Kejriwal, BJP, Swatcch Bharat, New Delhi Municipal Council, BJP office, New Delhi, Prime Minister, Narendra Modi, Offers. Mla Fund. For Toilet,

Kejriwal offers to build women's toilet in Delhi BJP office

బీజేపికి అరవింద్ కేజ్రీవాల్ బంఫర్ ఆఫర్..!

Posted: 10/14/2014 07:36 PM IST
Kejriwal gives bumper offer to bjp

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపికి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ అధ్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బంపర్ ఆఫర్ ను ఇచ్చారు. బీజేపి కార్యాలయంలో తన ఎమ్మెల్యే నిధులతో నిర్మాణం చేపడతానన్నారు. అదేంది అప్ కార్యాలయాన్ని నిర్మించుకుంటే లాభం కానీ, బీజేపి కార్యాలయంలో నిర్మాణాలా..? అదేగా మీ డౌట్.. లేక అరవింద్ కేజ్రీవాల్ బీజేపీలో చేరబోతున్నారని అనుమానాలు కలుగుతున్నాయా..? అబ్యే అదేం లేదు.

ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళలకు మరుగుదొడ్డి లేదని, తన ఎమ్మెల్యే నిధులతో అక్కడ మరుగుదొడ్డిని కట్టిస్తానంటూ అరవింద్ కేజ్రీవాల్ ముందుకు వచ్చారు. బీజేపీ ఢిల్లీ శాఖ కార్యాలయంలో మహిళలకు మరుగుదొడ్లు అందుబాటులో లేవని, తన ఎమ్మెల్యే నిధులతో ఆ కొరతను తీరుస్తానని ప్రస్తావిస్తూ ఢిల్లీ మునిసిపల్ కమిషనర్ కు ఆయన లేఖ రాశారు. పండిట్ పంత్ మార్గ్‌లోని బీజేపీ ఢిల్లీ శాఖ కార్యాయలం అరవింద్ కేజ్రీవాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ పరిధిలోకే వస్తుందని అందుకని తాను తన ఎంపీ నిధులతో నాలుగు యూనిట్లతో మరుగుదోడ్ల నిర్మాణం చేపడతానన్నారు.

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి ఢిల్లీ శాఖ కార్యాలయంలో మరుగుదోడ్లు లేవని, అవి లేకపోవడంతో కార్యాలయానికి వచ్చే మహిళా నేతలు, కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఆ భవనం బీజేపీకి సంబంధించినదే అయినా, తన నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి.. మహిళలు ఇబ్బందులు పడకుండా తన ఎమ్మెల్యే స్థానిక నిధుల నుంచి మరుగుడొడ్లను నిర్మిస్తానంటూ కేజ్రీవాల్ మంగళవారం ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  BJP  BJP office  New Delhi  Prime Minister  Narendra Modi  Offers. Mla Fund. Toilet  

Other Articles