Chandrababu fires on his cabinet ministers

chandrababu, temper, fires, cabinet ministers, NDA, Modi, ravela kishore babu, palle Raghunath reddy

chandrababu losses temper, fires on his cabinet ministers

చంద్రయ్య..? సీతయ్య..?

Posted: 09/21/2014 04:30 PM IST
Chandrababu fires on his cabinet ministers

మంచి పరిపాలనాధ్యక్షుడిగా మారు పేరు. ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన రికార్డు ఆయన సొంతం. కేవలం రికార్డే కాదు మంచి అనుభవం వున్న ముఖ్యమంత్రి కూడా.. ఎంతటి వారితోనైనా తనకు కావాల్సిన పనులను చేయించుకోవడంలో దిట్ట. తన మేధాసంపత్తి, సృజనాత్మకతతో రాజధాని లేని రాష్ట్రాన్ని.. అన్ని తానై నడిపిస్తారని ప్రజల కొండంత ఆశ. అందకనే అయన అధ్యక్షతన వున్న పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. అయనను మరోమారు ముఖ్యమంత్రిని చేశారు.

ఎవరి గురించి చెబుతున్నామో.. మీకు అర్థమైంది కదా..? ఆయనే చంద్రబాబు.. ఎన్డీఏ హయాంలో కేంద్రంలో చక్రం తప్పి.. రాష్ట్రానికి కావలసినంత నిధులు తెచ్చుకోగలిగిన దిట్ట. నిమ్న వర్గానికి చెందిన బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా చేసిన చతురత.. అవన్నీ ఇప్పుడేమయ్యాయి. ఇప్పుడు కూడా కేంద్రంలో తన మిత్రుడైన నరేంద్రమోడీ అధ్యక్షతన ఎన్డీయే ప్రభుత్వమే వుంది. అయినా ఎందుకా అసహనం..? ఎందుకా.. నిర్లిప్తత..? ఆయన కోపం అంతా ఎవరిపైన..? వీరు సచ్చీలురు, సమర్థులు అని ఆయన తెచ్చిపెట్టుకున్న మంత్రులపైనా..? లేక మరెవరిపైనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమస్యలు తిష్ట వేశాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా 14వ అర్థిక సంఘం కమీషన్ ఎదుట చెప్పారు. సమస్యల గురించి తెలియక పోతే బాధపడాలి కానీ, తెలిసిన తరువాత ఎందుకు బాధపడుతున్నారో అర్ధం కావడం లేదు. సమస్యలను పరిష్కరించే సత్తా వుండి కూడా ఆయన ఎందుకని అసహనానికి గురవుతున్నారు. తన క్యాబినెట్లో మంత్రులుగా నియమించుకున్న వారిపై ఎందుకు మండిపడుతున్నారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా అధికారులతో అమలు చేయించాల్సిన మంత్రులపై అధికారుల సాక్షిగా ఎందుకు అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన అమాత్యలు పరువును తానే ఎందుకు తీయదలుచుకున్నారు.

రాజధాని లేని రాష్ట్రంగా రికార్డులకెక్కిన ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన సమయంలో.. మంత్రలు పనితీరుపై గ్రేడింగ్ ఇవ్వడం ఎందుకు. ఇచ్చినా వాటిని గోప్యంగా వుంచకుండా.. మీడియాకు విడుదల చేయడం ఎందుకు..? నాలుగు మాసాలలో రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పనులు మంత్రులు ఎలా చేస్తారనేది అర్ధం కాని ప్రశ్న. మంత్రుల పనితీరుపై గ్రేడ్లు ఇచ్చి మీరు పనిచేయలేదో.. మీ పదవులు ఊడతాయ్ జాగ్రత్తా అని హెచ్చరించారా..? ఆయనే రాజు.. ఆయన మాటే శాసనం. అలాంటి సమయంలో గ్రేడ్ ఇవ్వడం.. వారిని ప్రజల్లో చులకన చేయడమే కదా అన్న విమర్శలు వినబడుతున్నాయి.

తాజగా క్యాంపు కార్యాలయంలో సమీక్ష సందర్భంగా చంద్రబాబు మంత్రులపై మరోసారి ప్రతాపాన్ని చూపారు. స్వయం సహాయక సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ సాక్షిగా మంత్రులకు చురకలు అంటించారు. మంత్రులు లేవనెత్తిన పలు సందేహాలపై ఆయన మండిపడ్డారు. ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తన సందేహాన్ని అడిగేందుకు ప్రయత్నించగా ఇది అసెంబ్లీయో, మంత్రివర్గ సమావేశమో కాదంటూ అడ్డుకున్నారు.

అలాగే తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని గుంటూరు జిల్లా నుంచి మంత్రి రావెల కిషోర్ బాబు కోరగా... తాను క్లారిటీ ఇవ్వాల్సింది మంత్రులకు కాదు... క్రిందిస్థాయి అధికారులకు అంటూ రావెలతో సీఎం మాట్లాడేందుకు నిరాకరించారు. చివరిసారిగా అవకాశం ఇవ్వాలని రావెల మరోసారి కోరినప్పటికీ చంద్రబాబు కుదరదని తేల్చి చెప్పారు. అధికారులకు సందేహాలు వస్తే మంత్రులను అడుగుతారు. మరి వారికే సందేహాలు వస్తే ముఖ్యమంత్రినేగా అడగాలి.. అయినా వారికి కలిగిన సందేహాలను వారు నివృత్తి చేసుకుందామంటే చంద్రబాబు మండిపడుతున్నారెందకని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకు పనికి రాని వాడిని కూడా నేతగా తయారు చేసే తెలుగుదేశం ప్యాక్టరీకి అధ్యక్షుడిగా వున్న చంద్రబాబు.. తన నేతల పరుపుతోనే ఆటలాడుకుంటారా..?

ఉమ్మడి రాష్ట్రం కస్తా శేషాంధ్రప్రదేశ్ గా మారడం.. దానికి ఆయన ముఖ్యమంత్రి కావడమే ఆయనలో అసహనానికి కారణమా.. ? ఇంతకీ ఆయనను కలచివేస్తున్న అంశాలేఃమిటీ..? ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలా..? లేక కేంద్రం నుంచి రాష్ట్ర పునర్ నిర్మాణానికి కావల్సిన నిధులు సమకూరుతాయా లేదా..? అన్న సందేహమా..? ఎన్ని సమస్యలు, ఆలోచనలైనా వుండవచ్చుగాక.. తన అసహనాన్ని ప్రజల ఎదుట ప్రదర్శిస్తే పోయేది తమ ప్రతిష్టేనన్న విషయం ఆయనకు తెలియదా..? అన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. ఏదీ ఏమైనా చంద్రయ్య.. సీతయ్య లా మారకూడదని.. నిండు పౌర్ణమి చంద్రుడి లానే వుండాలని, అప్పుడే రాష్ట్రానికి మేలు జరగుతుందని ప్రజలు కోరుతున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  temper  fires  cabinet ministers  NDA  Modi  ravela kishore babu  palle Raghunath reddy  

Other Articles