Actress mla roja clarification about divorce with husband selvamani

actress roja hot stills, mla roja news, actress mla roja, roja hot photos, roja news, mla roja latest interview, mla roja selvamani, selvamani mla roja, roja latest news

actress mla roja clarification about divorce with husband selvamani

భర్తతో ‘‘విడాకుల’’ మీద రోజా వ్యాఖ్యలు!

Posted: 09/08/2014 11:05 AM IST
Actress mla roja clarification about divorce with husband selvamani

(Image source from: actress mla roja clarification about divorce with husband selvamani)

గతకొన్నిరోజుల నుంచి  నటి, నగరి ఎమ్మెల్యే రోజా తన భర్త సెల్వామణితో విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రచారాలు సాగుతున్న విషయంలో తెలిసిందే! దీంతో ఇది ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. వీరిద్దరి విడాకుల మీద ప్రతిరోజూ ఏదో ఒక వార్తాకథనం కచ్చితంగా వస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే రోజా ఈ విషయం మీద ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఆదివారంనాడు ఈ వ్యాఖ్యలపై స్పందించిన రోజా.. అందరికీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి షాక్ కు గురిచేసింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో రాజకీయ కార్యకలాపాలతో బిజీగా వున్న రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విడాకుల విషయాన్ని ఖండించారు. తన భర్త సెల్వమణితో తనకు ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని.. విడాకులు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ వల్లే తామిద్దరం విడివిడిగా వున్నమంటూ క్లారిటీ ఇచ్చేసింది. సినిమాల విషయాలకు సంబంధించి సెల్వమణి చెన్నైలో బిజీగా వున్నారని.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా వుండేందుకు తాను హైదరాబాద్ లో వుంటున్నానని రోజా పేర్కొన్నారు.

అలాగే తామిద్దరం ప్రతీరోజూ ఫోన్లతో సంభాషణలు జరుపుకుంటున్నామని కూడా తెలిపారు. అంతేకానీ.. తామిద్దరం విడివిడిగా వుండటం వల్ల చాలామంది ఏవోవో ఊహించుకుని.. విడాకుల ప్రస్తావనను బయటకు తీసుకువచ్చారే తప్ప... అసలు తమ మధ్య ఏ విభేదాలు లేవని రోజా స్పష్టం చేసింది. ముందస్తుగా పూర్తి విషయాలను తెలుసుకోకుండా ఇలాంటి ఊహాగానాలను, వార్తలను సృష్టించకండి అంటూ ఆమె కోరారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress mla roja  selvamani  andhra pradesh politics  kollywood media  tollywood media  

Other Articles