Ap government increases upper job age limit by four years

government jobs, andhrapradesh government jobs, government jobs age limit, jobs age limit increased, chandrababu naidu, andhrapradesh jobs, latest news, telangana

chandrababu naidu increases upper age limit for government jobs in andhrapradesh by four years : upper age ilmit for govt jobs in ap increased soon go will issued

నిరుద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త !

Posted: 09/02/2014 12:11 PM IST
Ap government increases upper job age limit by four years

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వ తీపికబురు. సర్కారు ఉద్యోగాలే లక్ష్యంగా ప్రయత్నం చేస్తున్నావారికి అవకాశాలు పెంచేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను నాలుగు సంవత్సరాలు పెంచింది. అంటే ప్రస్తుతం ఉన్న 36ఏళ్ళ గరిష్ట వయస్సు పరిమితిని 40 ఏళ్ళుగా మార్చిందన్నమాట. త్వరలోనే దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. చివరి అవకాశంగా ఉన్న అభ్యర్దులకు ఇదో వరం లాంటిదని చెప్పవచ్చు. వయస్సు అయిపోతూ.., కలల కొలువు రాక బాధపడుతున్న వారికి తాజా నిర్ణయం గొప్ప ఊరటనిచ్చే అంశం.

కేటగిరీల వారిగా పెంచిన వయోపరిమితి ప్రకారం జరిగిన మార్పులు చూస్తే.., జనరల్ కేటగిరి అభ్యర్దులకు వయో పరిమితి 36సం. నుంచి 40సం.కు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి ప్రస్తుతం 41సం. పరిమితి ఉండగా దాన్ని 45కు పెంచారు. అదే విధంగా వికలాంగులకు 46సం. ఉన్న గరిష్ట పరిమితిని 50సం.గా చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన అవకాశంతో ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్న తమ కలను నిజం చేసుకుంటామని చెప్తన్నారు. జార్ఖండ్, బీహార్ సహా ఇతర రాష్ర్టాల్లో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని 2నుంచి 4సం.కు పెంచారు. ఈ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీలో కూడా నిరుద్యోగులకు అవకాశం ఇచ్చేందుకు బాబు నాలుగేళ్లు సడలింపు ఇచ్చారు.

 

త్వరలోనే భర్తీకి నోటిఫికేషన్లు

ఏపీలో ఉన్న వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో 4వేలకు పైగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి. వీటిలో గ్రూప్ 1, గ్రూప్2 పోస్టులు కూడా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి తీసుకున్న కొత్త నిర్ణయం నోటిఫికేషన్లకు ముందే అమల్లోకి వస్తే.., వయస్సు నిబంధన మార్పు వల్ల చాలామంది అభ్యర్దులు లాభం పొందే అవకాశం ఉంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  upper age limit  government jobs  latest news  

Other Articles