Actor ajay says he not caught in drunk and drive case

telugu heros, junior artist, writer, ajay, drunk and drive, scandal, hyderabad, tollywood, police, latest news, telangana, vilan character artist ajay, banjara hills

police caught actor ajay, writer srinivas in drunk and drive case at saturday night in banjara hills : iam not that ajay who caught in drunk and drive case sasy vilan charactor artist ajay

నేను ఆ అజయ్ కాదు !!

Posted: 08/24/2014 12:53 PM IST
Actor ajay says he not caught in drunk and drive case

మనిషిని పోలిన మనుషులు ఎంతమంది ఉంటారో చెప్పలేము. కాని పేర్లను పోలిన పేర్లు చాలానే ఉంటాయి. ఒక పేరు ప్రపంచంలో ఒకే వ్యక్తికి ఉంటుందని ఎవరూ హామి ఇవ్వలేరు. ఇప్పుడదే అజయ్ కు కష్టాలు తెచ్చిపెట్టింది. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లతో అందరికి ఇబ్బందులు కల్గించే అజయ్ కు నిజజీవితంలో తన పేరు పెద్ద ఇబ్బంది తెచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అజయ్ అనే సినిమా ఆర్టిస్ట్ పట్టుబడ్డాడు. అయితే అజయ్ అనగానే విలన్ వేషాలేసే అజయ్ అనుకుని ఎలక్ర్టానిక్ మీడియా ఫొటోలు ప్రసారం చేసింది. తప్ప తాగి పట్టబడ్డ విక్రమార్కుడు విలన్ అని వార్తలు ప్రసారం చేసింది. దీంతో పొద్దున్నే లేచి వార్తలు చూసిన అజయ్ షాక్ అయ్యాడు. నేను తాగి పోలిసులకు పట్టుబడటం ఎంటి.., ఇదేం గొడవ అనుకుని మీడియా సంస్థలకు ఫోన్ చేశాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టబడ్డ అజయ్ తాను కాదని.., అతనెవరో వేరే అజయ్ అని వివరణ ఇచ్చారు. దయచేసి తన ఫొటోలు, పేరును ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. దీంతో తప్పు సవరించుకున్న మీడియా సంస్థలు ఫొటోలు తొలగించాయి. తాను ఆ అజయ్ కాదు అని వివరణ ఇచ్చే లోపు జరగాల్సిన నష్టం జరిగింది. అజయ్ తప్పతాగి పట్టబడ్డాడు అని తెలుగు రాష్ర్టాల్లో ఉచిత ప్రచారం జరిగింది. అసలు విషయానికొస్తే.., బంజారాహిల్స్ పోలిసులు శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో జూనియర్ ఆర్టిస్ట్ అజయ్, రచయిత శ్రీనివాస్ మోతాదుకు మించి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలిసులు.. ఫైన్ విధించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajay  drunk and drive  tollywood news  hyderabad  

Other Articles