Janasena party gif

pawan kalyan latest news, pawan kalyan janasena, pawan kalyan latest news, pawan kalyan fires trs party, pawan kalyan kcr news, pawan kalyan gopala gopala movie, gopala gopala movie first look, kcr fires pawan kalyan, pawan kalyan campaign janasena, janasena party leaders

power star pawan kalyan busy in gopala gopala movie and Strengthen janasena party : power star and janasena party president pawan kalyan is busy in gopala gopala movie shootiing and strengthen his party to beat trs in ghmc elections

‘‘టీఆర్ఎస్’’ మీద సీరియస్ గా వున్న ‘‘జనసేన’’ పవన్!

Posted: 08/12/2014 04:12 PM IST
Janasena party gif

సార్వత్రిక ఎన్నికల అనంతరం పూర్తిగా రాజకీయ మౌనాన్ని పాటించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్ పార్టీ మీద సీరియస్ గా వుంటున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. అప్పట్లో తన జనసేన పార్టీని ప్రకటించిన నేపథ్యంలో పవన్ టీఆర్ఎస్ పార్టీమీద, ఆ పార్టీ నాయకుల మీద తీవ్రంగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే! ముఖ్యంగా కేసీఆర్ కుటుంబసభ్యులను టార్గెట్ చేసి ఆయన అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎన్నికల అనంతరం పవన్ మళ్లీ నోరు మెదపలేదు. ఏ రాజకీయపార్టీ మీద కామెంట్లు చేయలేదు. రాజకీయపరంగా ఆయన ఏరోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. పైగా ఇద్దరు సీఎంలకు అభినందనలు చెప్పి ఆయన మౌనంగానే వుండిపోయారు.

అయితే ఆమధ్య తన పేరును, తన పార్టీ పేరును వినియోగించుకుని ఎవరో అనధికారికంగా ప్రచారాలు చేసుకుంటూ విరాళాలు సేకరిస్తున్నారనే విషయం తెలిసిన వెంటనే.. తన పార్టీ గుర్తింపు కోసం ఎలక్షన్ కమిషన్ కు లేఖలు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో పూర్తి వివరాలను పరిశీలించిన అనంతర ఈసీ కూడా పార్టీ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేసింది. ఇందులో భాగంగానే జనసేన పార్టీ మీద ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈనెల 23వ తేదీలోపు తెలియజేయాలని ప్రకటన కూడా జారీ చేసింది. అంటే.. ఆగస్టు 23వ తేదీ జనసేన పార్టీ కూడా ఇక ఎలక్షన్లలో పోటీ చేయడానికి సిద్ధంగా వున్నట్లేనని లెక్క!

ఇలా ఈవిధంగా ఒకవైపు ‘‘గోపాల గోపాల’’ సినిమా షూటింగ్ లో పవన్ కల్యాణ్ బిజీగా వుంటూనే తన పార్టీని పటిష్టం చేసుకునే పనిలో పూర్తిగా మునిగిపోయారు. పార్టీ నమోదు అయిన వెంటనే తన పార్టీ గుర్తును ప్రకటించనున్నట్టు జనసేన పార్టీవర్గాల నుంచి అనధికారికంగా సమాచారాలు కూడా వెలువడుతున్నాయి. ఒకవేళ అన్ని సక్రమంగా జరిగితే.. ఈసారి జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో పోటీ చేయడానికి సిద్ధమేనని పవన్, ఆయన పార్టీ వర్గాలు పక్కా సమాచారాన్ని అందిస్తున్నాయి. తన తాజా చిత్రం షూటింగ్ ను వేగవంతంగా ముగించుకుని తన పార్టీ మీద దృష్టి పెట్టడానికి పవన్ కల్యాణ్ అన్ని సన్నాహాలను సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పాల్గొనడానికి పవన్ కల్యాణ్ అప్పుడే రాజకీయ మంతనాలు మొదలుపెట్టేశాడు కూడా! ఎలాగైనా హైదరాబాద్ లో జనసేన పార్టీ తన సత్తా చాటాలని.. టీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి తన పవర్ ఏంటో నిరూపించుకోవాలని పవన్ కల్యాణ్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నట్టు అంతర్గత వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడగలిగే వాళ్లను సమాయత్తం చేయడానికి పవన్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ పూర్తి పనులన్నీ దాదాపుగా ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని.. తన పార్టీని పటిష్టం చేయాలనే పంథంతో పవర్ స్టార్ అన్ని కార్యక్రమాలను సీరియస్ గా సిద్ధం చేసుకుంటున్నాడని ఇటు ఇండస్ట్రీ నుంచి రాజకీయ విశ్లేషకులు దాకా అందరూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles