Nara lokesh babu power full satires on cm kcr

nare lokesh angry on kcr, twitter lokesh, telangana cm kcr, kcr vs chandrababu naidu, tdp vs trs, telangana vs andhra pradesh, nara lokesh fire on kcr, seemandhra development, nara lokesh twitts, talangana latest news, kcr comments controversy, lokesh satires, chandrababu naidu satires on kcr, ap capital news

nara lokesh babu power full satires on cm kcr : nara lokesh comments on kcr, lokesh babu fire on telangana cm kcr

కేసిఆర్ కు నేను చూపిస్తా? ట్విట్టర్ పిట్ట

Posted: 08/07/2014 03:52 PM IST
Nara lokesh babu power full satires on cm kcr

ఇద్దరు సీఎంలే.. కానీ ఘాటుగా విమర్శలు చేసుకుంటారు. ఇద్దరి మద్య గురు శిష్యుల బంధం ఉంది. కానీ రాజకీయంగా శత్రవులైనారు. ఇద్దరు కలిస్తే.. షేక్ హ్యాండ్ లు, భుజం తట్టం, సరదా కబుర్లు , కానీ మైకు కనిపిస్తే చాలు.. ఒకరి పై ఒకరు లీటర్ల కొద్ది.. నూనె చల్లుకుంటారు. ఇప్పటి వరకు తండ్రులే తిట్టుకున్నారు. మొట్టమొదటి సారి.. కొడుకులు కొట్టుకోవటానికి తెరలేపారు.

ఆంద్రప్రదేశ్ కుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన కొడుకు మంత్రి తారక రామారావు. తండ్రికి చేదోడు గా ఉంటూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు పరుగుతీయుస్తున్నారు. అయితే నిన్న కేసిఆర్.. నారా చంద్రబాబు కు దమ్మున్నసవాల్ విసిరారు. దీంతో చంద్రబాబు.. కేసిఆర్ కు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం చెప్పటం జరిగింది.

అయితే ఇప్పుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు రంగంలోకి దిగటం జరిగింది. ఇతన్ని అందరు పిట్ట బాబు అని కూడా అంటారు. అంటే.. ట్విట్టర్ బాబు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై ట్విట్టర్ నుండి ఎన్ని ట్విట్లు చేసాడో చెప్పలేం. అయితే ఈరోజు తెలంగాణ సీఎం కేసిఆర్ కు ట్విట్టర్ చినబాబు పవర్ పుల్ సవాల్ విసిరాడు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అంటే ఏమిటో త్వరలోనే చూపిస్తామని లోకేష్ వ్యాఖ్యానించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడాలని ఆయన సవాల్ విసిరారు.

అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లకు రాష్ట్రం తీరుతెన్నులపై అవగాహనలేని కేసీఆర్ ఏదో ఒకటి మాట్లాడి, వివాదం రేపి తెలంగాణ ప్రజల్లో ఇమేజ్ సంపాదించుకోవాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. మాటల సీఎంగా కాకుండా చేతల సీఎంగా కేసీఆర్ నిరూపించుకోవాలని ఆయన విమర్శించారు.

కేసిఆర్ అధికారం చేపట్టి రెండు నెలలు కాకుండానే రైతులపై లాఠీఛార్జ్, ఉస్మానియా విద్యార్థులపై దౌర్జన్యాలు తప్ప కేసీఆర్ తెలంగాణకు చేసిన మంచి పని ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడికెళ్తే అక్కడ హామిలివ్వడం కాకుండా కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని లోకేష్ నిలదీశారు.

కృష్ణాజిల్లా నూజివీడు మండలం నర్సపూడిలో నారా లోకేష్ సోలర్ విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమను విమర్శించటం కాదని, ముందు హైదరాబాద్ లో కోతలు లేకుండా కరెంట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

అయితే నారా లోకేష్ చేసిన కామెంట్ల పై.. తెలంగాణ రాష్ట్రం నుండి.. ఐటీ మంత్రి కె. రామారావు (కేటిఆర్) లేదా మంత్రి హారీష్ రావు, లేదా సీఎం కేసిఆర్ , లేదా.. నిజమబాద్ ఎంపీ కవిత వీరిలో ఎవరినుంచైన సమాదానం, కామెంట్లు వస్తాయని అందరికి తెలుసు. అవి ఎలా వస్తాయో, ఎంత ఘాటు గా, ఎంత హాట్ గా ఉంటాయో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles