1800 old iraqi church torched

1800 old iraqi church torched, isis militants torch ancient church in iraq, ancient church in mosul burnt, cross in ancient cathedral torched, virgin mary idol in iraq broken by isis

1800 old Iraqi Church torched by ISIS

1800 సంవత్సరాల చర్చిని తగులబెట్టిన ఐఎస్ఐఎస్

Posted: 07/24/2014 04:52 PM IST
1800 old iraqi church torched

ఇరాక్ క్రిస్టియన్స్ కిచ్చిన గడువు తీరిపోవటంతో ఇరాక్ లో 1800 సంవత్సరాల పురాతనమైన చర్చిని ఐఎస్ఐఎస్ సైనికులు తగులబెట్టారు.  

జూన్ నెలలో ఉత్తర ఇరాక్ ని ఆధీనంలోకి తీసుకున్న ఐఎస్ఐఎస్ అక్కడ సున్ని వారసత్వాన్ని నెలకొల్పే పనిలో ఉన్నారు.  అందువలన, సున్నీ ముస్లింలైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సైనికులు ఇరాక్ లో మోసుల్ లో ఉన్న ముస్లింలకు ఇచ్చిన నోటీసులో, ఇస్లాంలోకన్నా మారిపోండి, అదనపు పన్నైనా కట్టండి లేదా మా చేతుల్లో హతమారండి అని ఉంది.  దానితో చాలా మంది క్రిస్టియన్లు ఇరాక్ ని వదిలి వెళ్ళిపోయారు.  ఇరాక్ లోని మైనారిటీ వర్గమైన క్రిస్టియన్లు ఇరాక్ లో లేకుండా చెయ్యాలన్నది ఐఎస్ఐఎస్ ఉద్దేశ్యం.

అందరూ వదిలిపెట్టి వెళ్లిపోయన తర్వాతనే మోసుల్ లో అస్సిరియన్ క్రిస్టియన్ చర్చ్ కి నిప్పంటించారని అల్ అరబియా రిపోర్ట్ చెప్తోంది.  న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం చర్చికి నిప్పంటించటమే కాకుండా ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు మోసుల్ లోని సిరియాక్ అర్థోడాక్స్ ఆర్కిడియోసిస్ కేంద్రమైన సైంట్ ఎఫ్రెమ్స్ కేథడ్రల్ లోని శిలువను పెరికివేసి, పురాతనమైన వర్జిన్ మేరీ విగ్రహాన్ని కూడా పగులగొట్టారు.  

క్రిస్టియన్ గుర్తులు, క్రిస్టియన్లు అక్కడ జీవించిన ఆనవాళ్ళేమీ లేకుండా ఐఎస్ఐఎస్ అలా చెరిపివేస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles