Seven kids die in madhya pradesh gurudwar wall collapse

Seven kids die in Madhya Pradesh, Seven kids die in gurudwar wall collapse, Seven kids die, Madhya Pradesh wall collapse, Burhanpur.

Seven kids die in Madhya Pradesh gurudwar wall collapse

గురుద్వారా గోడలకు 7చిన్నారులు బలి!

Posted: 07/14/2014 01:10 PM IST
Seven kids die in madhya pradesh gurudwar wall collapse

యముడు ఎప్పుడు ఎవరి పై ఎటాక్ చేస్తాడో చెప్పటం చాలా కష్టం. యమపాశానికి .. చిన్న, పెద్ద అనే తేడా లేదు ఎవరైన యమపాశానికి బలికావాల్సిందే. యముడు ప్రకృతిని బాగా ఉపయోగించుకోని ప్రజలు ప్రాణాలను సులువుగా తీసుకుపోతాడు. అది పుణ్య స్థలం అయిన సరే, ఆయనకు భయం లేదు.. మనిషి ప్రాణాలను తీసుకుపోవటమే ఆయన కర్తవ్యం. అయితే భారీ కురుస్తున్న వర్షం కారణంగా.. మద్యప్రదేశ్ లోని గురుద్వారా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వర్షపు నీటికి నాని, కూలిన గురుద్వారా గోడ కింద ఏడుగురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. మరో తొమ్మది మంది తీవ్రంగా గాయపడ్డారు.

తపతి నది ఒడ్డున ఉన్న బర్హాన్ పూర్ పట్టణంలోని రాజ్ ఘాట్- షికార్ పూర్ ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షంలో పూర్తిగా తడిసిన ఓ పురాతన కాలం నాటి గురుద్వారా గోడ పక్కనే ఉన్న చేనేత కార్మికులకు చెందిన మూడు ఇళ్లపై పడిపోయింది.

దీంతో ఆ ఇళ్లలో నిద్రిస్తున్న ఏడుగురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. వీరంతా 1-14 ఏళ్ల మధ్య వయసు వారే. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో ఇండోర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో శిథిలాల కింద సజీవ సమాధి అయిన పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles