Cm kcr asks to change dress code of telangana police

telangana cm kcr, cm kcr asks telangana police, kcr asks telangana police dress code change, kcr asks to change dress code of telangana police, telangana home minister.

CM kcr asks to change dress code of telangana police

తెలంగాణ పోలీసులారా రంగు మార్చండి? కేసిఆర్

Posted: 06/21/2014 05:53 PM IST
Cm kcr asks to change dress code of telangana police

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ..కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు, ఉద్యోగులకు హమీలు ఇస్తే.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. తెలంగాణ పోలీసులకు .. ఇప్పటికే వీకెంట్ సెలవులు ఇవ్వటం మొదలుపెట్టారు. తెలంగాణ రైతులకు అభయం హస్తం ఇవ్వటం జరిగింది.

అయితే కొత్త తెలంగాణ రాష్ట్రంలో పని పోలీసులు అర్జెంటుగా రంగు మార్చండని ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల పనితీరును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ పోలీసులకు కేసిఆర్ వరాల జల్లు కురిపించారు.

change-dress-code-of-telangana-police

1650 ఇన్నోవాలు, అవసరం మేరకు టూవీలర్లు కొనుగోలు చేయాలని కేసీఆర్ తెలిపారు. పోలీస్ సిబ్బంది డ్రెస్ కోడ్‌ను పూర్తిగా మార్చాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌ జంటనగరాలు అంతా కవరయ్యేలా సీసీ కెమరాలు తక్షణం అమర్చండని కేసీఆర్ అధికారులకు తెలిపినట్టు సమాచారం. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో 'అధునాతన టెక్నాలజీని వాడుతూ న్యూయార్క్ తరహా పోలీసింగ్‌ను నిర్వహించాలి' అని కేసీఆర్ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ తో , హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles