Balakrishna celebrates his birthday in basavatarakam cancer hospital

balakrishna celebrates his birthday, basavatarakam cancer hospital, Happy Birthday to Nandamuri Balakrishna, Mla Nandamuri Balakrishna, , hindupur mla, నందమూరి బాలకృష్ణ, హిందూపురం నియోజకవర్గం, బాలకృష్ణ జన్మదినం, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మంత్రి పదవి,

balakrishna celebrates his birthday in basavatarakam cancer hospital, Happy Birthday to Nandamuri Balakrishna

బావ కంటే నాకు బాగా తెలుసు? బాలకృష్ణ

Posted: 06/10/2014 12:25 PM IST
Balakrishna celebrates his birthday in basavatarakam cancer hospital

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అభివృద్దే తన ప్రధమ లక్ష్యమని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఈరోజు తన జన్మదిన వేడుకలను హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరుపుకున్నారు.

అయితే కొద్ది సేపు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలోని కొన్ని విషయాలను బయట పెట్టారు. బావ (చంద్రబాబు) కంటే నాకు బాగా తెలుసు కాబట్టి, ముందుగా మంత్రి పదవి వదులుకున్నానని అన్నారు. తెలుగు ప్రజలకు సేవ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటిని పూర్తి చేసిన తరువాతనే.. మంత్రి పదవి తీసుకోవటానికి నేను సిద్దపడతాను. ఈ విషయాన్ని బావతో చెప్పటం జరిగింది. ఆయన ఆనందంగా నా లక్ష్యం వైపు దూసుకుపోమ్మని సలహా ఇవ్వటం జరిగిందని బాలయ్య అన్నారు.

అందుకే బావ(చంద్రబాబు) కేబినెట్ లో మంత్రి పదవి ఆశించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఈరోజు బాలకృష్ణ జన్మదినం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు. బాలయ్య రాజకీయంగా ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles