Ys jagan open letter to cm chandrababu

jagan open letter to CM chandrababu, jagan open letter to AP CM, ys jagan open letter to CM, YS Jagan Mohan Reddy,

ys jagan open letter to CM chandrababu

బాబుకు జగన్ ‘సాక్షి ’ లేఖ?

Posted: 06/09/2014 04:48 PM IST
Ys jagan open letter to cm chandrababu

అయిదడుగుల దూరంలో అధికారంలో కోల్పోయిన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ‘జనం’ సాక్షిగా లేఖలు రాయటం మొదలుపెట్టారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నారా చంద్రబాబు నాయుడికి వైఎస్ జగన్ మొదటి లేఖ రాయటం జరిగింది. అందులో తన డిమాండ్ ను పొందుపరిచారు.

ప్రజల మనిషిగా.. జనం సాక్షిగా బాబుగారికి లేఖ రాయటం జరిగింది. జగన్ రాసిన లేఖలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలి. మీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పంట రుణాలు, బంగారం రుణాలతో పాటు వ్యవసాయ రుణాలకు సంబంధించి ఇచ్చిన మాటను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మాఫీ చేయండి.

సీఎంగా మీరు ఈ పనిచేయడానికి విధివిధానాలతో పనేంటి? వ్యవసాయరుణాలు, బంగారం రుణాలు ఎన్ని ఉన్నాయో, డ్వాక్రా , చేనేత రుణాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. కమిటీలు, 45 రోజుల గడువు వంటి అంశాలు ఆ రోజు మీరు చేసిన వాగ్దానంలోగాని, టిడిపి మేనిఫెస్టోలో గానీ లేవు. పుస్తెల తాళ్లు, దస్తావేజులు వెనక్కు వస్తాయంటూ టీవీల్లో యాడ్స్‌ ఇచ్చిన మీరు నేడు రైతులను నిరాశ, నిస్పృహలోకి నేట్టివేసి కాలయాపన కమిటీలను నియమించడం సరికాదని జగన్ అన్నారు.

అయితే జగన్ సాక్షి లేఖపై.. తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారాని ఆహ్వానించిన , గర్వంతో.. రాకుండా ఉన్న జగన్ లేఖకు అర్థం లేదని అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles