Us diplomat talks about modi s american visa

US Diplomat talks about Modi's American Visa, US defends its stand on Gujarat 2002, Obama invites Modi to USA, Modi can travel on A1 Visa to USA

US Diplomat talks about Modi's American Visa

మోదీ పట్ల ప్రజావాణికి ప్రాధాన్యతనిచ్చాం- అమెరికా

Posted: 05/23/2014 01:18 PM IST
Us diplomat talks about modi s american visa

గుజరాత్ లో 2002 లో జరిగిన నరమేధ నేరాన్ని మోదీకి ఆపాదిస్తూ ఆయన వీసాను రద్దు చేసిన అమెరికా వివిధ రకాలుగా తన చర్యను సమర్థించుకుంటూ, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తో సత్సంబంధాలను నెలకొల్పటం కోసం మోదీకి దేశనాయకుడిగా ఎ1 వీసాను ఉపయోగించుకోవచ్చని ఎన్నో సందర్భాల్లో చెప్తూ వస్తూంది.  

2014 ఎన్నికలలో అపూర్వమైన విజయాన్ని సాధించి భారత ప్రధానమంత్రిగా అధికారాలను చేపట్టబోతున్న నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకార వేడుకకు ఆసియా దేశ నాయకులనందరినీ ఆహ్వానించటం స్వాగతించదగ్గ చర్యంటూ అగ్రస్థాయిలో ఉన్న అమెరికా డిప్లామాట్ ఒకరు అన్నారు. 

అదే సమయంలో 2002 గుజరాత్ ఘటనను గంభీరమైన విషయంగా తీసుకున్నామని, ఆ విషయంలో రికార్డ్ లో కూడా స్పష్టంగా ఉందని, అయితే భారత దేశ వోటర్లు ఆ విషయంలో తగు నిర్ణయం తీసుకుని అంత పెద్ద మెజారిటీతో గెలిపించటాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని, భారత దేశాన్నిముందుకు తీసుకెళ్ళటానికి, ప్రపంచంలోని ఇతర దేశాలతో చెలిమితో ముందుకు వెళ్ళటానికి మోదీ చేసే పనులలో మేమూ భాగస్వాములమవుతామని, వీలైనంత త్వరగా అమెరికాకు రమ్మని ఒబామా ఆహ్వానించటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని కూడా ఆ డిప్లామాట్ అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles