Kcr declared modi as an enemy of telanga

KCR declared Narendra Modi as an enemy of Telanga, kcr speech in election, kcr public speech, kcr campaign, trs kavitha speech, trs campaign, harish rao

KCR declared Narendra Modi as an enemy of Telanga, kcr speech in election, kcr public speech, kcr campaign, trs kavitha speech, trs campaign, harish rao

ఈయన తెలంగాణ శత్రువు

Posted: 04/25/2014 08:36 AM IST
Kcr declared modi as an enemy of telanga

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కే. చంద్రశేఖర రావు భాజాపా ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని సైతం వదలటం లేదు. మొన్నటి వరకు మోడీ జపం చేసిన ఆయన భారతీయ జనతా పార్టీ తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో మోడీని తెలంగాణ శత్రువుగా అభివర్ణిస్తున్నాడు.

మొన్న నిజామాబాద్ , ఎల్బీ స్టేడియాల్లో జరిగిన సభల్లో మోడీ చంద్రబాబును, పవన్ లను ప్రక్కన కూర్చోబెట్టుకొని, వారు రాసిచ్చిన స్క్రిప్టు చదివి తెలంగాణ ద్రోహుల్లో ఒకరయ్యాడని విమర్శించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేసిన కేసీఆర్ అన్ని చోట్లా చంద్రబాబును, వెంకయ్య నాయుడుల పై విమర్శలు చేశాడు. .

తెలంగాణలో టిడిపికి ఒక్క సీటు కూడా రాదని ఆయన అన్నారు. టిఆర్ఎస్ కు తొంభై సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. సీమాంధ్ర చంద్రబాబు తెలంగాణను విడిచి పోవడం లేదు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కూటమిని ఓడించి తరమిమేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో గెలుపు ఖాయమని చెబుతున్న కేసీఆర్ వారి పై విమర్శులు చేయడం ఎందుకో అని తెదేపా - బాజాపా నాయకులు అనుకుంటున్నారు. 

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles