Hate speach by giriraj singh of bjp

Hate speach by Giriraj Singh of BJPLok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014 photos, search Lok Sabha elections 2014,lok sabha elections 2014 survey, lok sabha elections 2014

Hate speach by Giriraj Singh of BJP, Salman Khurshid, Shatrughan Sinha

మరో రెచ్చగొట్టే వ్యాఖ్య, మరో కేసు!

Posted: 04/21/2014 11:42 AM IST
Hate speach by giriraj singh of bjp

ఎన్నికలలో గెలవటమే ప్రధానంగా తీసుకుంటున్న రాజకీయ నాయకులకు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని ఎలాగూ లేదు, తమ మీద కేసులు నడుస్తాయానే భయం అంతకంటే లేదు.  ఇంత వరకు ఎన్నికల కమిషన్ ఎవరిమీద చర్యలు తీసుకుందిగనక. 
జార్ఖండ్ లో తన ఎన్నికల ప్రసంగంలో భాజపా నాయకుడు గిరిరాజ్ సింగ్ శనివారం నాడు మోదీకి ప్రతికూలంగా పనిచేసేవారికోసం పాకిస్తాన్ లో రాజకీయ మక్కా మదీనా ఉందని, అది భారత్ ని సంఘటితంగా ఉండనివ్వదని అన్నారు.  దానికి కొనసాగింపుగా ఆదివారం మాట్లాడుతూ మోదీకి ప్రతికూలంగా వోటేసేవారికి భారత్ లో స్థానం లేదని సంచలన వ్యాఖ్య చేసారు. 
గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యల మీద పెట్టిన కేసును విచారించిన సబ్ డివిజనల్ మాజిస్ట్రేట్ జెజె సమంత ప్రసంగం వీడియో చూసిన తర్వాత, అది ఎన్నికల నియమావళికి స్పష్టంగా వ్యతిరేకమేనని అన్నారు.  దీని మీద ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని వత్తిడి తేవాలని కాంగ్రెస్ పార్టీ యోజన చేస్తోంది.  దీనిమీద మాట్లాడిన కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, భాజపా నాయకులు ఇండియా పాకిస్తాన్ సమయంలో మాట్లాడిన మాటలను ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డారు.  పాకిస్తాన్ లో ఎలా ఉన్నా, భారత్ లో మాత్రం ఒక మత ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపటం జరగదని అన్నారాయన. 
కానీ శత్రుఘ్న సిన్హా మాత్రం గిరిరాజ్ సింగ్ చాలా మంచి వ్యక్తని, కొందరు బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో ఆవేశంలో తమ మీద తామే నియంత్రణ కోల్పోతారని, అంతేకానీ ఆయన చెడ్డ మనిషి కాదని అన్నారు.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles