Kiran kumar petition before supreme court on friday

Kiran Kumar petition before Supreme court on Friday, Kiran Kumar petition against State bifurcation, Petition challenging Telangana bill, Former CM Kiran Kumar petition in SC

Kiran Kumar petition before Supreme court on Friday

శుక్రవారం సుప్రీం కోర్టు ముందుకు రానున్నకిరణ్ కుమార్ పిటిషన్

Posted: 03/06/2014 12:50 PM IST
Kiran kumar petition before supreme court on friday

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సుప్రీం కోర్టులో వేసిన వ్యాజ్యం శుక్రవారం విచారణకు స్వీకరించబడుతోంది.

రాష్ట్ర విభజన బిల్లు తయారు చేసిన విధానం, దాన్ని ముందుకు నడిపించిన వైనం, రాష్ట్రంలో తిరస్కరించిన బిల్లుని పార్లమెంటులో ఆమోదింపజేసిన పద్ధతి, బిల్లులోని లొసుగులు మొదలైన విషయాలను ఉటంకిస్తూ కిరణ్ కుమార్ ఫైల్ చేసిన పిటిషన్ రేపు కోర్టు ముందుకి రానుంది. 

రాష్ట్ర విభజన విషయంలో మొదటి నుంచీ ఒకే మాట మీద నిలబడ్డ కిరణ్ కుమార్ రెడ్డి విభజన వలన ఇరు ప్రాంతాలకూ అన్యాయం జరుగుతుందని చెప్తూ వస్తున్నారు.  రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించగానే ఆయన మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని తెలియజేస్తూ రాజీనామా చెయ్యటమే కాకుండా, గవర్నర్ తో ప్రత్యామ్నాయాన్ని చూసుకోమని, తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగదలచుకోలేదని అన్నారు. 

ఇక విభజన ఎలాగూ జరిగిపోయింది కదా మన రాజకీయ సమీకరణల వైపు దృష్టి సారిద్దామని అందరు రాజకీయ నాయకులూ తమ తమ ఇల్లు సర్దుకునే పనిలో పడితే కిరణ్ కుమార్ మాత్రం ఇంకా తన పట్టుని విడవకుండా, అందరూ ఊహించినట్లుగా సొంత పార్టీ పెట్టే దిశగా పావులు కదపకుండా కేవలం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తుండటం విశేషం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles