Unholy alliances in center and state says jagan

Unholy alliances in center and state says Jagan, YSR Congress Party President Jagan, TDP President Chandrababu Naidu, TDP founder NT Rama Rao, NT Rama Rao welfare schemes

Unholy alliances in center and state says Jagan

కేంద్రంలోను, రాష్ట్రంలోను అక్రమ పొత్తులు – జగన్

Posted: 03/04/2014 10:43 AM IST
Unholy alliances in center and state says jagan

కేంద్రంలో కాంగ్రెస్, భాజపాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ తెదేపాల అక్రమ పొత్తులతో రాష్ట్రాన్ని ముక్కలు చేసారంటూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైయస్ జగన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో అన్నారు.  తనెంత కృషి చేసినా ఆ మూడు పార్టీల అక్రమ పొత్తుల మూలంగా తెలుగు ప్రజలకు అన్యాయం జరిగిందన్నారాయన.  అయినా శేషాంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి తాను పాటుపడతానని జగన్ మాటిచ్చారు. 

రాష్ట్రంలో వైకాపా నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని, దేశంలో అనుకూలమైన వ్యక్తి ప్రధానమంత్రి పగ్గాలందుకుంటారని జగన్ విశ్వాసాన్ని ప్రకటించారు.  దానివలన ఆంధ్రప్రదేశ్ కి నిధులు బాగా వచ్చేట్టుగా చూస్తానని కూడా ఆయన అన్నారు. 

ఈ సందర్భంగా ప్రస్తుతం సీమాంధ్రలో పుంజుకుంటున్న తెదేపా మీద విమర్శనాస్త్రాలను గుప్పించిన జగన్ ప్రస్తుతపు రాజకీయాలకు పాతకాలపు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు సరితూగరని అన్నారు.  ఎన్ టి రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు నీరుగార్చారని ఆరోపించారాయన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles