Salam to sonia t congress party program

Salam To Sonia-T Congress party program, Komatireddy Rajagopala Reddy, Thanksgiving to Sonia Gandhi, Telangana statehood, Bhyvanagiri congress public meeting

Salam To Sonia-T Congress party program

సోనియమ్మకు సలాం- భువనగిరిలో రాజగోపాల్ రెడ్డి

Posted: 02/28/2014 09:55 AM IST
Salam to sonia t congress party program

తెలంగాణా ఏర్పాటుకు పట్టుబట్టి సాధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి భువనగిరిలో కృతజ్ఞతా సభను ఏర్పాటు చేస్తున్నామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

శుక్రవారం జరుగుతున్న కృతజ్ఞతా సభను సోనియమ్మకు సలాం అనే పేరుతో నిర్వహిస్తున్న రాజగోపాల్ రెడ్డి, ఇందులో కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ పాల్గొంటున్నారని తెలియజేసారు.   తెలంగాణా రాష్ట్రానికి పార్లమెంటులో విజయం లభించిన తర్వాత అక్కడ జరుగుతున్న మొట్టమొదటి సభ కాబట్టి ఈ సభకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్న తెరాస ఇంకా ఆ పని చెయ్యకపోవటంతో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తెలంగాణా సాధించితెచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని ప్రజల మనసులోంచి పోకుండా ఉండటం కోసం చేస్తున్న కృతజ్ఞతా సభలు తెరాసా విజయోత్సవ సభ ముందు పేలవంగానే కనిపిస్తున్నా పోరాటం చెయ్యటం కోసం బలాలను సమీకరించుకోవటం ముఖ్యం కనుక కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా చెయ్యవలసివస్తోంది. 

తెలంగాణా కోసం పోరాడుతున్న సమయంలో అన్ని సంవత్సరాలూ కాంగ్రెస్ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియక, ఎప్పుడు తీసుకుంటుందో తెలియక, ప్రజలకు ఏం చెప్పాలో తెలియక సతమతమవుతూ వస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ అదే దశలో అనిశ్చితిలో ఉన్నా, తెలంగాణా విషయంలో సోనియా గాంధీ నిర్ణయాన్ని, ఆమె పట్టిన పట్టును పార్టీ ద్వారా తమ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలే ఈ కృతజ్ఞతా సభలు.

అయితే ఉద్యమ పార్టీకూడా కలిసొస్తే ఆ ధాటి వేరుగా ఉండేది కదా అని ఆవేదన పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles