Nalini daughter seeks forgiveness from rahul gandhi

Rahul Gandhi,Nalini daughter, Harithra Sriharan, Rajiv Gandhi assassination case, Sonia Gandhi.

Nalini daughter seeks forgiveness from Rahul Gandhi

క్షమించండి.. రాహుల్ గాంధీ గారు?

Posted: 02/20/2014 03:35 PM IST
Nalini daughter seeks forgiveness from rahul gandhi

రాజీవ్ హత్య కేసు ముద్దాయిలు, నళిని, మురుగన్ ల కుమార్తె హరిత్ర శ్రీహరన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని  క్షమించమని కోరింది. ఈమె రాహుల్ తండ్రి రాజీవ్ హత్య కేసులో దోషులైన మురుగన్, నళినిల కుమార్తె. తొమ్మిదేళ్లుగా బ్రిటన్ లో ఉంటోంది. తన తల్లిదండ్రులను క్షమించాలని రాహుల్ కు విజ్ఞప్తి చేసింది. 

అయితే జరిగిన దానిపై తన తల్లిదండ్రులు ఇప్పటికే విచారం వ్యక్తం చేశారని చెప్పింది. మీరు ప్రేమించే వ్యక్తిని (రాజీవ్) కోల్పోయారు. అదే శిక్ష నేను కూడా అనుభవిస్తున్నాను. నా తల్లిదండ్రులు బతికే ఉన్నా, వారికి దూరంగా జీవిస్తున్నాను. 

ఒకవేళ వారు నేరం చేసి ఉంటే అందుకు తగిన శిక్ష అనుభవించారు' అని హరిత్రా పేర్కొంది. తన తల్లిదండ్రులను విడుదల చేయాలని నిర్ణయించిన తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి నిర్ణయం తనకెంతో  సంతోషం  కలిగించిందని, ఆనందం  పట్టలేకపోతున్నానని  హరిత్ర పేర్కొంది.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles