Aap announces first list of candidates for ls elections

Aam Aadmi Party(AAP),AAP Lok Sabha Candidates,Kumar Vishwas,manish sisodia,Aam Aadmi Party, AAP, Arvind Kejriwal, Ashutosh, Kapil Sibal, Lok Sabha elections, Lok Sabha polls, Medha Patkar

Just two days after resigning from the Delhi government, the Aam Aadmi Party has turned its attention on the upcoming general elections.

ఆప్ పార్టీ లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల

Posted: 02/16/2014 05:12 PM IST
Aap announces first list of candidates for ls elections

ఢిల్లీలో అనూహ్య విజయం సాధించి, కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీ ఫీఠాన్ని అధిష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని 49 రోజులకే ప్యాకప్ చేసిన ఆప్ వచ్చే ఎన్నికల పై ద్రుష్టి సారించింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దల పై,  కేంద్ర మంత్రుల పై పోటీ చేసే అభ్యర్థుల్ని ఇప్పుడే ప్రకటించి కాంగ్రెస్ గుండెల్లో గుబులు రేపుతోంది. 20 లోక్ సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేధీ నుంచి కుమార్ విశ్వాస్ను , కేంద్ర మంత్రులు కపిల్ సిబల్పై అశతోష్(చాందీ చౌక్), సల్మాన్ ఖుర్షీద్పై ముకుల్ త్రిపాఠి(ఫరూకాబాద్), మనీష్ తివారిపై హెచ్ఎస్ ఫూల్కా(లూధియానా), మిలింద్‌ దేవ్‌రాపై మీరా సన్యాల్‌(దక్షిణ ముంబై), బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీపై అంజలి దామానియా (నాగపూర్), ములాయంసింగ్‌ యాదవ్‌పై బాబా హరదేవ్‌, సురేష్ కల్మాడీపై సుభాష్ వడే పోటీ చేయనున్నారు.

యోగేంద్ర యాదవ్(గుర్గావ్), మీరా సన్యాల్(దక్షిణ ముంబై), మేధా పాట్కార్(ఈశాన్య ముంబై), మయాంక్ గాంధీ(వాయవ్య ముంబై) పోటీ చేస్తారని ఆప్ ప్రకటించింది. ఇప్పటికే రాజీనామా చేసి అభాసు పాలవుతున్న ఆప్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి పరువు నిలుపుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles