Bjp blames congress for violence in parliament

BJP blames congress for violence in Parliament, L K Advani, Sushma Swaraj, AP State Reorganization Bill, Telangana bill

BJP blames congress for violence in Parliament

అంతా కాంగ్రెస్ నాటకం- భాజపా ఆరోపణ

Posted: 02/13/2014 03:08 PM IST
Bjp blames congress for violence in parliament

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ ఈ రోజు పార్లమెంటులో జరిగిన సంఘటనలను గురించి మాట్లాడుతూ ఇంతవరకు దేశచరిత్రలోనే ఇలా జరగలేదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే సభలో విధ్వంసాన్ని సృష్టించారని, అధికారపక్షం కనీసం మంత్రులను కూడా నియంత్రించలేకపోయిందని అన్నారు.  తెలంగాణా బిల్లు వివాదస్పదమవబట్టే ఇలా జరుగిందని, అయితే ఇలాంటి పరిణామాలు పార్లమెంటులో చోటుచేసుకోవటం బాధాకరమని ఆయన అన్నారు.  సోనియా గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ మంత్రులు స్పీకర్ వెల్ లోకి రావటం ఏమిటని అద్వానీ విమర్శించారు.

భాజపా సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టటం మీద ప్రధాన ప్రతిపక్షమైన తమ పార్టీకి సూచనచెయయలేదని అన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్యలెందుకు తీసుకోవటం లేదని ఆమె ప్రశ్నించారు.  పరిస్థితులు ఇంత గందరగోళంగా ఉన్న సమయంలో సభలో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టటం తగదని ప్రధానమంత్రికి ముందుగానే సూచించినట్లుగా ఆమె తెలియజేసారు.  సభలో ఎవరికీ కాపీలు ఇవ్వకుండా నేరుగా తెలంగాణా బిల్లును ప్రవేశపెడుతున్నామని చెప్పటం పట్ల ఆమె ఆశ్చర్యాన్ని ప్రకటించారు.  ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధమని ఆమె అన్నారు.  ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ఆడుతున్న నాటకం కాకపోతే కాంగ్రెస్ మంత్రులే కాంగ్రెస్ అధక్షురాలు, ప్రధాన మంత్రి ముందు ఆందోళన చెయ్యటమేమిటని ఆమె ప్రశ్నించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles