టాలీవుడ్ లో ఎప్పుడు ఏ వింతలు, విశేషాలు జరుగుతాయో ఎవరు చెప్పాలేరు.. ఇప్పటి వరకు హీరోయిన్లకు గుడి కట్టిన అభిమానులు ఉన్నారు. ఆ హీరోయిన్లకు పూజలు చేస్తున్న పెళ్లికానీ ప్రసాదులు చాలా మంది ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు గుడి కట్టే విషయం టాలీవుడ్ హీరోల అందరు సమావేశం అయ్యారు.
మనం ఎలాగైన.. ఈ ప్రాజెక్ట్ చేసి తీరాలని అందరు ఒక తీర్మానం చేసుకోని బయటకు నడిచి వెళ్లారు. టాలీవుడ్ హీరోలకు సపోర్టుగా పవన్ అభిమానులు కూడా మేము సైతం అంటూ చెయ్యి కాలిపారు.
పవన్ కళ్యాణ్ టెంపుల్ ప్రాజెక్ట్ .. హీరో నితిన్ ఆద్వర్యంలో జరుగుతుంది. ఈ కమిటిలో నిర్మాత బండ్ల గణేష్ దగ్గర నుండి హీరో నాని వరకు అందరు పవన్ కళ్యాణ్ గుడి కట్టే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే ముందుగా పవన్ కళ్యాణ్ గుడిలో పూజారిగా ఎవరు ఉంటారు అనేది చర్చలు తీవ్రంగా జరిగాయి. అయితే టాలీవుడ్ లోని సీనియర్ పెద్దలు ఇద్దరి పేర్లను వెండితెరపైకి తేవటం జరిగింది. ఒకరు బ్రహ్మనందం.. మరోకరు ..ఆలీ.
బ్రహ్మనందం, ఆలీ .. ఇద్దరు పవన్ కళ్యాణ్ భక్తులే కాబట్టి ఎవరిని తీసుకోవాలో. పవన్ కళ్యాణ్ గుడి కమిటికి అర్థం కాలేదు.. వెంటనే కైకాల సత్యనారాయణ కల్పించుకోని.. ఈ ఇద్దరి పై ఓటింగ్ పెడితే సరిపోతుందని చెప్పటంతో అందరు సై అన్నారు.
కోట శ్రీనివాసరావు ఆద్వర్యంలో..ఫిలింనగర్ చాంబర్ వద్ద ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఎమ్మెస్ నారాయణ దొంగ ఓట్లు వేసే వారిని పట్టుకోవటానికి సిద్దంగా ఉన్నారు.
తాగుబోతు రమేష్ .. ఓటర్లకు ముఖ్య సూచనలు చెబుతూ... తాగి తుళ్ళుతూ... ఓటర్ల మీద పడుతూ. చెంపదెబ్బలు తింటున్నారు.
వెంటనే గిరిబాబు పెద్ద కొడుకు రఘబాబు కల్పించుకొని.. తాగుబోతు రమేష్ భారీ నుండి.. ఓటర్లను తప్పించి పంపిస్తున్నారు. అయితే ఈ ఎలక్షన్ ఫిలింనగర్ వాసులు వరకు మాత్రమే అని . ఎన్నికల కమిషన్ కోట శ్రీనివాసరావు చెప్పటం జరిగింది.
ఈ ఎన్నికల్లో కొన్ని నింబంధనలు పాటించాలని .. అభ్యర్థులకు సూచించారు.
ఓటర్లను తమ కామెడీ విన్యాసాలతో విసిగించరాదు. పవన్ భక్తులకు ఫ్రీ గా సినిమా లు చూపించరాదు. వారిని ఏకాంతంగా కలవకూడదనే నిబందనాలు పెట్టడం జరిగింది.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో రోజా .. నేను ఓటు వేస్తా అంటూ.. క్యూలో నిలబడిన వెంటనే వెన్నల కిషోర్ వచ్చి మేడమ్ మీరు ఏజ్ బార్ కాబట్టి, మీకు ఓటు వేసే అర్హత కోల్పోయారని చెప్పటంతో.. రోజా రెచ్చిపోయారు.
అక్కడే ఉన్న మీడియా ముందుకు వెళ్లి ..నేను పవన కళ్యాణ్ భక్తురాలిని, చిరంజీవితో ఎన్నో సినిమాలు చేసాను. నాకు ఇప్పటికి పవన్ కళ్యాన్ తో నటించాలని ఉందని అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల అది కుదరలేదని చెప్పటం జరిగింది.
అత్తారింటికి దారిదే సినిమా లో పవన్ కు అత్తగా నేను నటించాలి కానీ నథియా తన్నుకుపోయిందని ఆవేథన వ్యక్తం చేసింది. చివరకు పవన్ కళ్యాన్ భక్తురాలిగా నాకు ఓటు వేసే హక్కు లేదని చెప్పటం చాలా దారుణం అని రేపు ఫిలింనగర్ భారీ ఎత్తున్న ధర్నా చేస్తునని ప్రకటించి.. బ్యాగ్ లోని చిన్న అద్దం ముక్క తీసి .. తన గ్లామర్ ను సరిచేసుకొని.. అక్కడ నుండి వెళ్లిపోయింది.
బ్రహ్మనందం , ఆలీ.. ఎన్నికల పోలింగ్ .. చిన్న చిన్న చెదురుముదురు ఘటనలతో ప్రశాంతంగా జరిగిందని .. కోట శ్రీనివాసరావు ప్రకటన చేయటం జరిగింది. బ్యాలెట్ బాక్స్ లను.. త్రివిక్రమ్, వర్మల ఆద్వర్యంలో భద్రపరచటం జరిగింది.
పవన్ కళ్యాన్ గుడిలో పూజారి కోసం నిర్వహించిన ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయని .. పవన్ భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దాసరి నారాయణ రావు, అల్లు అరవింద్, డి. సురేష్ , రాఘవేంద్ర రావు ..ఇంక తదితర పెద్దలు కలిసి .. దీనిపై క్షణ్ణం గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు.
ముందు మీరు పవన్ కళ్యాణ్ గుడి కట్టండి.. ఆ తరువాత .. ఈ ఎన్నికల పలితాలు విడుదల చేస్తామని చెప్పటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొండవలస..అయితే నేనోప్పుకోను.. ఫిలింనగర్ వీదుల్లో తిరుగుతూ.. ప్రచారం చేస్తున్నారు. ఇక బ్రహ్మనందం, ఆలీ మాత్రం.. రెండు వారలకు కడప లోని దర్గ వద్ద వెళ్లి వస్తున్నారు.
టాలీవుడ్ హీరోలు, పవన్ అభిమానులు కలిసి పవన్ కళ్యాణ్ కు గుడి పనిలో బిజీగా ఉన్నారు.. పవన కళ్యాణ్ గుడి రెడీ కావటానికి మరి కొన్ని రోజులు పడుతుందని .. వై.వి చౌదరి ప్రకటించారు.
ఇంతలో ..పల్లీ, వాటర్ ప్యాకెట్స్, వేడి వేడి బిరియాని, కాఫి, ఛాయ్ అంటూ.. అమ్మగోల సంగీతం చెవిన పడటంతో.. వెంటనే కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా.. ఉన్న సికింద్రబాద్ రైల్వే ప్లాట్ ఫారమ్ కనబడింది.
అంటే శ్రీకాకుళంలో రైలు ఎక్కిన పవన్ కళ్యాణ్ అభిమాని కన్న కల నుండి తేరుకోవటానికి .. 10 నిమిషాలు సమయం పట్టింది. ఇంతలో రైల్వే టీసి రావటం. టిక్కెట్ అడగటంతో.. మనవాడు కన్న కల మొత్తం పూర్తిగా మరిచిపోయి.. ఫిలింనగర్ కు వెళ్లే బస్సు ల గురించి వాకబు చేస్తూ.. ముందుకు సాగిపోయాడు... అతని కల నిజ రూపంలోకి రావాలని కోరుకుందాం...
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more