All employees unions in ap on strike

All employees unions in AP on strike, Samaikya rashtra parirakshana Vedika, Ashok Babu, Election commission, Arrangements for elections hampered

All employees unions in AP on strike, Samaikya rashtra parirakshana Vedika, Ashok Babu

అర్థరాత్రి నుంచి ప్రారంభమౌతున్న ఉద్యోగుల సమ్మె

Posted: 02/05/2014 08:56 AM IST
All employees unions in ap on strike

సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్ అశోక్ బాబు పిలుపు మేరకు సీమాంధ్ర ఉద్యోగుల సంఘాలు ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పడుతున్నాయి.  రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ సమ్మెను 24 గంటలు విధులలో ఉండేవారు అర్ధరాత్రి నుంచి, మిగిలినవారు ఈ రోజు ఉదయం నుంచి పాటిస్తారు.  

రెవిన్యూ శాఖవారు భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ కి నోటీసు అందజేస్తూ తహశీల్దార్లు బదిలీ ఉత్తర్వులను తీసుకోవద్దని, సమ్మెలో పాల్గొనమని కోరారు.  ఇది ఎన్నికలకోసం చేసే సంసిద్ధతకు అడ్డుపడుతుంది.  వీరంతా సొంత ప్రాంతంలో ఉండకుండా ఎన్నికల సమయంలో వేరే ప్రాంతాలకు బదిలీలు చెయ్యాలని ఎన్నికల సంఘం ఆదేశాలకు ఇది సానుకూలంగా ఉండకుండా ఏర్పాట్లకు ఇబ్బంది కలిగిస్తుంది.  

అన్ని ఉద్యోగ సంఘాలు పాల్గొంటున్న ఈ సమ్మెలో ఆర్ టి సి ఉద్యోగులు మాత్రం పాల్గొనటం లేదు.  సమ్మె నోటీసులను గతంలో లాగా విడివిడిగా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలన్నీ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ద్వారా ఇవ్వటం జరిగింది.  విభజనను అడ్డుకునేందుకు చేస్తున్న ఆఖరి పోరాటం కాబట్టి చిత్తశుద్ధితో చెయ్యటానికి ఉపక్రమించాయని అశోక్ బాబు తెలియజేసారు.  

చలో ఢిల్లీ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు పాల్గొనాలని కోరిన అశోక్ బాబు ఎన్నికల కోసం చేసే ముందస్తు ఏర్పాట్లలో విఘాతం ఏర్పడుతున్నందువలన ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో స్పందించవలసివుంటుందని అన్నారు.  ఒక్కరోజు మద్దతుగా ఈ రోజు కిరాణా దుకాణాలు, సినిమా హాళ్ళతో సహా మూసివేయాలని ఆయన కోరారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles