Cine industry lost another eye says ntr

cine industry lost another eye says NTR, ANR passes away, Akkineni Nageswara Rao Dies, Akkineni Nageswara Rao Dead, Akkineni Nageswara Rao Died, Akkineni Nageswara Rao is no more, akkinenni nageswara rao, nagarjuna, Akkineni Nageshwar Rao Cancer, ANR Death, Celebrity Death, Telegu Cinema, Telugu films, hyderabad, cancer, died

cine industry lost another eye says NTR

రెండవ కన్ను పోగొట్టుకున్న చలనచిత్ర పరిశ్రమ- ఎన్టీఆర్

Posted: 01/22/2014 01:25 PM IST
Cine industry lost another eye says ntr

అక్కినేని నాగేశ్వరరావు అనగానే వెంటనే గుర్తుకొచ్చే మరో మహా నటుడు ఎన్టీ రామారావు.  ఇద్దరూ అగ్ర తారలుగా తెలుగు సినిమా ప్రపంచాన్ని దీర్ఘకాలం ఏలినవారే.  పోటాపోటీగా నడిచేది వారిద్దరి మధ్యా సినీ నిర్మాణం.  సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైద్రాబాద్ కి తరలి రావటానికి కృషిచేసినవారు కూడా వీరిద్దరే.  అభిమాన సంఘాలు ఏర్పడటం కూడా వీరిద్దరి కాలంలోనే జరిగింది. 

అందువలన తెలుగు సినీ ప్రపంచం వీరిద్దరినీ రెండు కళ్లుగా భావించేది.  అందులో ఒక కంటిలో జ్యోతి 1996 లోనే ఆరిపోగా, మరో కంటి జ్యోతి ఈ రోజు ఉదయం ఆరిపోయి సినీ పరిశ్రమచేత కంట తడి పెట్టించింది. 

వీరిద్దరూ కలిసి నటించిన పౌరాణిక, సాంఘిక చిత్రాలు తెలుగు ప్రేక్షకులను రంజింప జేసాయి.  నటనలోనూ, వాచకంలోనూ శుద్ధత, పరిపూర్ణతను పుణికిపుచ్చుకున్న ఈ ఇద్దరు మేటి నటులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవటమే కాకుండా, జూనియర్ కళాకారులకు అమూల్యమైన సలహాలనిస్తూ వారిలోని బిడియాన్ని పోగొడుతూ వాళ్ళని ప్రోత్సహించేవారు.  సినీ కళాకారులకు గౌరవం, సముచిత వేతనం లభించేట్టుగా చేసింది కూడా వీరిద్దరే. 

ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ చలనచిత్ర రంగం ఈ రోజు రెండవ కంటిని కూడా పోగొట్టుకుందని ఆవేదనను వ్యక్తం చేసారు.  ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించిన ఎన్టీఆర్ ఆయన గురించి ఎక్కువగా మాట్లాడేంత యోగ్యత తనకు లేదని, ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు ఆత్మకు శాంతి లభించాలని కోరుతున్నానన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles