Congress leader donated his assets to servent

gajaraj singh proparty, servent kidnap for assets, congress leader gajaraj singh assets,

congress leader gajarag singh doneted his properity to servent

పనిమనిషికి 600 కోట్లిచ్చిన కాంగ్రెస్ నేత

Posted: 01/15/2014 11:45 AM IST
Congress leader donated his assets to servent

 

 

 

జీవితాంతం  తనకు సేవలందించిన  పనిమనుషులపై  యజమానులు  వాత్సల్యం చూపించిన  సంఘటనలు  అనేకం  విన్నాం. కానీ తన యావదాస్తిని  తనను నమ్ముకున్న పనిమనిషికి  రాసిచ్చిన ఘనత గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన గజరాజ్ సింగ్ కే దక్కుతుంది. తనకు అయిన వాళ్లెవరూ  అక్కరకు రారనుకున్న గజరాజ్ సింగ్ తన యావదాస్తినీ  తన దగ్గర  40 ఏళ్ల పాటు  పనిచేసిన పనిమనిషి  పేరిట రాశాడు.

సుమారు 600 కోట్లు విలువ చేసే ఆస్తిని  ఈ విధంగా పనిమనిషికి  రాసివ్వడంతో ఈయనగారి  బంధువులు  మండి పడుతున్నారు. గజరాజ్ సింగ్ స్థానిక కాంగ్రెస్ నేత. ఇతను గత సెప్టెంబరులో మరణించాడు. అయితే గజరాజ్ వీలునామా విషయం తెలుసుకున్న అతని బంధువుల ఆ పనిమనిషి  కుటుంబాన్ని నిర్భంధించి  వేధిపులకు  గురిచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు  రంగప్రవేశం చేయడంతో  విషయం  వెలుగులోకి  వచ్చింది.

అలాగే గజరాజ్ సింగ్ గురించిన  పలు విషయాలు కూడా తెలిశాయి. 1976 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఈయనకు  పిల్లలు లేరు. దీంతో తనను కనిపెట్టకుని  చూస్తున్న వినూభాయ్ అనే పనిమనిషికి  తన యావదాస్తీ దక్కేలా వీలునామా రాశాడు. గజరాజ్ కు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. అతని ఆస్తిపై కన్నేసిన బంధువులు  పనిమనిషిని  నిర్బంధించారు.  ఎట్టకేలకు పోలీసుల రాకతో పనిమనిషి  వినూభాయ్ కి విముక్తి లభించింది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles