Bring back buddhas begging bowl from afghanistan

buddaha presented the 'bhikshapatra' (begging bowl) to the people of Vaishali. afganistan museum, lard budda begging bowl, lok sabha

Bring back Buddhas begging bowl from Afghanistan,

భారత్ కు బుధ్దుడి భిక్షాపాత్ర

Posted: 01/15/2014 09:26 AM IST
Bring back buddhas begging bowl from afghanistan

బౌద్ధమత గురువు  బుద్ధుడు వాడినట్లు చెబుతున్న భిక్షాపాత్రను  భారత్ తీసుకు వచ్చేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఇది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో ఉంది. అయితే దీనిని  నిర్ధారించుకొని  భారత్ తీసుకువచ్చేందుకు  భారత పురావస్తుశాఖ  ప్రయత్నిస్తోంది. బౌద్ధమతాన్ని స్థాపించిన బుద్ధుడు  భారత దేశంలో  తన మత ప్రచారానికి ఎంతో క్రుషి చేశాడు.
అలాగే బారతదేశంలో అతనికి ఎంతో మంది శిష్యగణం ఉన్నారు.  ఈ నేపధ్యంలో బుద్ధుని భిక్షా పాత్రను తీసుకువచ్చేందుకు  ఇద్దరు శాస్ర్త వేత్తలు భారత్ నుండి కాబూల్ కు తరలి వెళ్లారు. బుద్ధుడు  ఆ పాత్రను  తన పరినిర్వాణానికి ముందు వైశాలి వాసులకు కానుకగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది.  
దీని ఎత్తు ఏడడుగులు, బరువు 350 కిలోలు  ఉందని తెలుస్తోంది.

దీనిని భారత్ తీసుకు వచ్చే విషయమై  గత నెలలో ఆర్ జెడి ఎంపి రఘువంశ్ ప్రసాద్ సింగ్  లోక్ సభలో ప్రస్తావించారు. అప్పటి నుండే కాబూల్ లోని భారత దౌత్య కార్యాలయం  పలు వివరాలను సేకరించింది. ఇందుకోసం  భారత్ నుండి కాబూల్ కు తరలిన బ్రుందం  అది బుద్ధుడు ఇచ్చిన భిక్షా పాత్రేనని తెలితే దానిని భారత్ తీసుకు వచ్చేందుకు  ఆ ఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలో  సంప్రదింపులు జరుపుతున్నారు.  ఇవి ఫలమైతే మరో ఘనమైన చారిత్రక చిహ్నం భారత్ కు దక్కనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles