Apngos chalo assembly on jan 22

Ashok Babu, Chalo Assembly, telangana bill, bhogi mantalu, ap ngo

APNGOs Chalo Assembly on Jan 22, Ashok Babu, Chalo Assembly, telangana bill, bhogi mantalu, ap ngo

ఇంటికొక్కరు హైదరాబాద్ రండి

Posted: 01/14/2014 06:34 PM IST
Apngos chalo assembly on jan 22

నిన్న ఒంగోలులో తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసిన ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మలి విడత అసెంబ్లీ సమావేశాలు ముగింపుకు ఒక రోజు ముందు అంటే ఈనెల 22న అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. కొంత మంది విభజన వాదులు సీమాంధ్ర ప్రజలను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని, మలి విడత సమావేశాల్లో 159 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని అశోక్ బాబు అన్నారు.

తాము జరిపే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సీమాంధ్ర ప్రాంతం నుండి ఇంటికి ఒక్కరు హైదరాబాద్ రావాలని అన్నారు. ప్రశాంతంగా, చట్టబద్దంగా తాము నిరసనన కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చారు. సమైక్య వాదం పై అన్ని పార్టీలు ఓకేతాటి పై రావడానికి ఏపీఎన్జీఓల ఫలితమే అన్నారు.

మరి కిరణ్ కుమార్ రెడ్డి తొత్తుగా చెప్పుకునే అశోక్ బాబు అసెంబ్లీ సమావేశాలప్పుడు అంసెబ్లీ ముట్టడికి అనుమతి ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ బిల్లు చర్చ జరుగుతున్నప్పుడు ఇలా ముట్టడికి పిలుపునివ్వడం పై తెలంగాణ వాదులు మండి పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles