Ashok babu blames political parties in samaikya movement

Ashok Babu blames political parties, political parties in Samaikya Movement, APNGO's Association President Ashok babu, Political paties non cooperation

Ashok Babu blames political parties in Samaikya Movement

సమైక్య లో రాజకీయ పార్టీల పాత్ర హుళక్కి- అశోక్ బాబు

Posted: 01/07/2014 09:05 AM IST
Ashok babu blames political parties in samaikya movement

రాజకీయపార్టీలు సమైక్యపోరులో పాల్గొంటున్నట్టుగా నటించారు కానీ నిజానికి వారి మద్దతు ఏ మాత్రం లేదంటూ ఎపి ఎన్జీవో సంఘ అధ్యక్షుడు అశోక్ బాబు విమర్శించారు.  ఏదో కలిసివస్తున్నారని చూసాం కానీ వీరి ధోరణి ఇలాగే ఉంటే మునుపటిలాగానే ఉద్యోగులే మళ్ళీ ఉద్యమాన్ని చేపడతారన్నారాయన. 

తెలంగాణా బిల్లు మీద చర్చలు జరిపేందుకు పూనుకుని జనవరి 3 న శాసనసభ సమావేశమౌతున్న సందర్భంగా పిలుపునిచ్చిన బంద్ విజయవంతమైంది కానీ రాజకీయ పార్టీలు తమ ధోరణి తమదే కానీ ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేయలేదని అశోక్ బాబు తూలనాడారు.  అఖిలపక్ష సమావేశాలలో కాంగ్రెస్, తెదేపా, సమాజ్ వాదీ పార్టీలు మాటిచ్చాయి కాని అలా జరగలేదన్నారాయన.  బంద్ తో పాటుగా జనవరి 10 వరకు చేస్తామన్న ఆందోళనలో ఆ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో కలిసిరావటం లేదని అశోక్ బాబు అన్నారు. 

వైకాపా పేరు ఎత్తకుండా, ఎపిఎన్జీవోల సంఘంలో ఒక పార్టీవారు ఉద్యోగులను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసారని అయితే అవేమీ పారలేదని అన్న అశోక్ బాబు, ఉద్యమం విషయంలో తెలుగు ప్రజలు తమ సంఘం మీద పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ఆందోళనలను చేపడతామని అశోక్ బాబు మాటిచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles