I am not asking kasapa mp seat sharmila

YS Sharmila, Sharmila, YS jagan Mohan Reddy,YS Jagan Sister,Jagan sister,Kadapa YS Sharmila MP,Kadapa Mp Seat,YS Avinash Reddy,YS Rajasekhara Reddy,Dirty Politics,Yellow media,

I am not asking kasapa MP seat says Sharmila.

అన్నతో నాకు ఎలాంటి విభేదాలు లేవు

Posted: 12/16/2013 08:25 AM IST
I am not asking kasapa mp seat sharmila

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కి, ఆయన సోదరి వైయస్ షర్మిలకి కడప ఎంపీ సీటు కేటాయింపు విషయంలో విభేదాలు తలెత్తాయని, అందుకే జగన్ జైలు నుండి బయటకు వచ్చిన తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్న వదిన బాణంగా ప్రజల్లోకి వచ్చి పార్టీ తరుపున యాత్రలు చేపట్టిన షర్మిళ ఇప్పుడు పూర్తిగా దూరంగా ఉండటంతో నిజంగానే అన్నా, చెల్లెళ్ళ మధ్య విభేదాలు తలెత్తాయని అనుకున్నారు.

వాటన్నింటికి షర్మిళ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో పటాపంచలు చేసింది. అన్న తిరిగి వచ్చాడు కాబట్టి నా అవసరం పార్టీకి అవసరం లేదనిపిస్తుందని, అంతా అన్న చూసుకుంటాడని నేను దూరంగా ఉంటున్నానే తప్ప మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. నేను కడప లోక్ సభ సీటు కావాలనుకుంటున్నానని, అది అన్న ఇవ్వడం లేదని, నాకు అన్నకు విభేదాలున్నాయని మన ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ నాయకుల ప్రచారం మాత్రమేనని, కడప లోక్‌సభ సీటు అవినాశ్‌కు ఇవ్వాలని, ఎప్పుడో డిసైడైపోయింది. అవినాశ్ ఎవరు?

మా చిన్నాన్న కొడుకు. అంటే నాకు తమ్ముడు. నేను ఎప్పుడూ కడప సీటు గురించి ఆలోచన చేయలేదు. అది కావాలని అనుకోలేదు. కడప సీటు నాకు ఇమ్మని ఎప్పుడూ ఎవరినీ అడగలేదని, నేను ఇంత వరకు ఎక్కడి నుండి పోటీ చేస్తానని అనలేదని చెప్పుకొచ్చారు. షర్మిళ ఇంత క్లారిటీ ఇచ్చిన తరువాత వీరి పై వస్తున్న వార్తలకు బ్రేక్ పడతాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles