Tdp leader somi reddy fire on jc diwakar reddy

tdp leader somi reddy fire on jc diwakar reddy, Somireddy fires on JC Diwakar Reddy, congress party vs tdp, ap bifurcation, rayala telangana,

tdp leader somi reddy fire on jc diwakar reddy, Somireddy fires on JC Diwakar Reddy

సీమ రెడ్డికి పౌరుషం లేదా?

Posted: 11/18/2013 06:32 PM IST
Tdp leader somi reddy fire on jc diwakar reddy

సీమ రెడ్డికి పౌరుషం లేదా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన పై దూకుడు పెంచుతున్న విషయం తెలిసిందే. రాయల తెలంగాణ అంశంపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవాలనుకుంటున్నట్లు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రాయల తెలంగాణ కోసం కేంద్రమంత్రులు కిషోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రయత్రిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

రాష్ట్ర విభజన తదితర విషయలపై ఆయన తమకు ప్రత్యేక రాష్ట్రం అవశ్యం గురించి తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపకపోతే భవిష్యత్తులో ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తలెత్తే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీమాంధ్రకు కర్నూలును రాజధానిగా చేయకపోతే రాయలసీమ అసంతృప్తికి గురౌవుతుందన్నారు. రాయల తెలంగాణకు కోస్తాంధ్ర నేతలు కూడా సహకరించాలని జేసీ విజ్ఞప్తి చేశారు.

 

జేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడుతున్నారు. రాయలసీమ విచ్ఛిన్నానికే రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకువస్తున్నారని, ఒక ప్రాంతంలో ఉద్యమం వస్తే రెండు ప్రాంతాలను విభజించాలనడం సరికాదని సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డిలో సీమ పౌరుషం లేదని ఎద్దేవా చేశారు. రాయల తెలంగాణ చేస్తే నాలుగు జిల్లాలు కరువు జిల్లాలుగా మారతాయని సోమిరెడ్డి పేర్కొన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles