Telangana sega on tdp chandrababu

telangana sega on TDP Chandrababu, chandrababu naidu, ysrcp, ys vijayamma, telagana sega to ys vijayamma, telagana issue, tdp, telugudesam-babu,

telangana sega on TDP Chandrababu

తెలంగాణ సెగలో చంద్రబాబు

Posted: 11/01/2013 02:57 PM IST
Telangana sega on tdp chandrababu

నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాద్యక్షరాలు వైఎస్ విజయమ్మకు తెలంగాణ సెగ తగిలిన విషయం తెలిసిందే. అయితే దీంతో వైసీపీ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అదే ఈరోజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. రాష్ట్ర విభజన విషయంలో రెండుకళ్ల సిద్ధాంతం అనుసరిస్తున్న ఆయనకు తెలంగాణవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడును ఈరోజు దామరచెర్ల వద్ద నిరసనకారులు అడ్డుకున్నారు. బాబు కాన్వాయ్ కు అడ్డుపడి ....జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 

అక్కడి నుంచి మిర్యాలగూడ మండలం ఏడుకొండల తండాలో పర్యటిస్తారు. జేఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్ భోజనం అనంతరం వేములపల్లి మండలంలోని బుగ్గబావితండాలో పంట నష్టం తెలుసుకుంటారు. తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో వరద బాధితులతో మాట్లాడుతారు. ఆ తర్వాత నేరుగా కట్టంగూరు చేరుకుంటారు. అక్కడ జరిగిన పంట నష్టం వివరాలు రైతులను అడిగి తెలుకుంటారు. మరోవైపు చంద్రబాబు పర్యటించే ఆయా మండలాల్లో తెలంగాణవాదుల నుంచి నిరసనలు వ్యక్తం కాకుండా టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

 

సీమాంద్రలో పర్యటించిన చంద్రబాబుకు సమైక్య సెగ తగిలింది. ఆ సందర్భంలో సమైక్యవాదిపై చంద్రబాబు చెయి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో పర్యాటన చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణ సెగ తగులుతుంది. ఇలాంటి సందర్భలో చంద్రబాబు ఏం చేస్తాడో చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles